40.2 C
Hyderabad
April 19, 2024 15: 10 PM
Slider ముఖ్యంశాలు

ఏటూరునాగారం రేంజ్ పరిధిలో జనారణ్యంలోకి వచ్చిన పులి

#PugMark

అరణ్యం దాటి జనారణ్యంలోకి మరో పులి వచ్చింది. ఏటూరునాగారం రేంజ్ పరిధిలోని ఐలాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులు కనిపించాయి.

పెద్ద పులి పగ్ మార్కులు బీట్ ఆఫీసర్ కి కనబడడంతో వెంటనే ఆయన ఎఫ్.ఆర్వో కు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పగ్ మార్కులను (పులి అడుగులను) కొలిచి నమోదు చేశారు.

పగ్ మార్కులను బట్టి పులిని అటవీ సిబ్బంది గుర్తిస్తారు. ఎఫ్.ఆర్వో అసిఫ్, సెక్షన్ ఆఫీసర్ ప్రభాకర్, బీట్ ఆఫీసర్ రమేష్ పగ్ మార్కులు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించారు.

వెంటనే కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే పులి కదలికలను ట్రాక్ చేయాల్సిందిగా డీ. ఎఫ్.వో ప్రదీప్ కుమార్ శెట్టి పలు సలహాలు సూచనలు చేశారు.

కె. మహేందర్, సత్యం న్యూస్

Related posts

నేరాల దర్యాప్తులో సాంకేతికతను వాడండి

Satyam NEWS

ఘనంగా సాగిన “18 పేజెస్” బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

Bhavani

పేదలకు  అందుబాటులో నాణ్యమైన  వైద్య సేవలు

Satyam NEWS

Leave a Comment