28.7 C
Hyderabad
April 25, 2024 03: 58 AM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

అవినీతి ఫైళ్లను పాతరేస్తున్న పాత అధికారులు

ap secratariat

ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వందరోజుల పాలన ఆశించిన రీతిలో జరగడం లేదు. అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన ఏ ఇక్క తెలుగుదేశం పార్టీ నాయకుడి పై కూడా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయడం కోసం ఒకటి రెండు కాంట్రాక్టులను రద్దు చేయడం మినహా అసలు అవినీతికి పాల్పడిన తెలుగుదేశం నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పెద్ద లోపంగా భావిస్తున్నారు.

రాజధాని భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందనే విషయం పై కూడా ఇప్పటి వరకూ నిర్దుష్టంగా చర్యలు తీసుకోకపోవడంపై వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని భూముల కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి అనేక లొసుగులు ఉన్నట్లు సాధారణ ప్రజలకు కూడా అర్ధం అయింది కానీ ప్రభుత్వ పరంగా చర్యలు ఎందుకు తీసుకోవడంలేదో అర్ధం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేసి నిబంధనలకు వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన సందర్భాలు టిడిపి పాలనలో చాలా ఉన్నాయి.

వాటిపై ఇప్పటి వరకూ విచారణకు కూడా ఆదేశించకపోవడం పెద్ద లోపంగా భావిస్తున్నారు. అప్పటిలో ఆర్ధిక శాఖలో తీవ్రమైన పరిపాలనా పరమైన లోపాలు ఉండేవి. ఈ లోపాలతో కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అయింది. అప్పులుగా తీసుకువచ్చిన సొమ్ములను తెలుగుదేశం పార్టీ నాయకులు విలాసాలకు వాడుకున్నారు. వీటిపై దర్యాప్తు జరిపించలేకపోవడం ఎందుకో చాలా మందికి అర్ధం కావడం లేదు. మునిసిపల్ వ్యవహారాల శాఖలో అప్పటిలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయి. అదే విధంగా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఇంట్లోనే దొంగ సొమ్ము దొరికింది. వ్యవసాయ శాఖ కు సంబంధించి రుణమాఫీలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి.

రుణమాఫీ అనర్హులకు వెళ్లిన విషయం కూడా అందరికి తెలుసు. అయినా వంద రోజుల్లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన బంగారం చెన్నై లోని ఒక బ్యాంకు నుంచి రహస్యంగా తరలిస్తుండటం అదృష్టవశాత్తూ ఆఖరు నిమిషంలో పట్టుబడటం తెలిసిందే. ఈ సంఘటనపై కూడా ఇప్పడి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత స్థానాలలో ఉన్న పలువురు అధికారులకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరింత పెద్దపీట వేయడం వల్లే ఇలా ఏ అంశం పైనా విచారణ జరగడం లేదని అంటున్నారు.

చంద్రబాబునాయుడి హయాంలో ఆయనతో రాసుకుపూసుకు తిరిగిన అధికారులకు పెద్ద పెద్దపోస్టింగులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన ఒక ఐఏఎస్ అధికారికి అయితే దాదాపు 6 పోస్టులు ఉన్నాయి. ఆ శాఖలలో ఆయన చెప్పిందే వేదంగా నడుస్తున్నది. సచివాలయం మొత్తం ఇప్పటికీ చంద్రబాబునాయుడికి ఎప్పటికప్పుడు సమాచారం అందించే అధికారులే ఎక్కువ మంది ఉన్నారు. చంద్రబాబునాయుడు తీసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను యధాతధంగా కొనసాగించడం వల్ల కూడా పాలన ఆశించిన వేగంతో జరగడం లేదు.

Related posts

టీవీ9 రవిప్రకాష్ పై మరో కొత్త కేసు నమోదు

Satyam NEWS

నక్షత్ర తాబేలును ఫారెస్ట్ అధికారులకు అందజేసిన పూజారి

Satyam NEWS

భయం భయంగా బూర్గుల భవన్ లో

Satyam NEWS

Leave a Comment