22.2 C
Hyderabad
December 10, 2024 10: 55 AM
Slider ఆధ్యాత్మికం

నవంబరు నెలలో మహనీయుల తిరు నక్షత్రోత్సవాలు

#tirumala

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సంవత్సరం పొడవునా  అనేక ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా, శ్రీవారి పరమ భక్తుల తిరు నక్షత్రోత్సవాలు కూడా టీటీడీ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నవంబరు 3వ తేదీ ఆదివారం నాడు తిరుమల నంబి శాత్తుమొర వైభవంగా జరిగింది. శ్రీ వైష్ణవ భక్తుడైన తిరుమలనంబి తిరుమలలో తీర్థ కైంకర్యాన్ని ప్రారంభించారు.

శ్రీవారి ఆలయం దక్షిణ మాడ వీధిలో శ్రీ తిరుమల నంబి ఆలయం కూడా ఉంది. శ్రీ రామానుజాచార్యుల అంశతో జన్మించిన శ్రీ మనవాళ మహాముని  శాత్తుమొర నవంబరు 6న జరగనుంది. నవంబరు 9న అత్రి మహర్షి, శ్రీ పిళ్ళైలోకాచార్య, శ్రీ పోయిగై ఆళ్వార్, శ్రీ భూదత్తాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలతో పాటు, శ్రీ వేదాంత దేశికాచార్య శాత్తుమోరతో కూడా జరుగనుంది. నవంబరు 10న శ్రీ పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి  జరగనున్నాయి.

Related posts

కొల్లాపూర్ లో పండుగ వేళ షాట్ సర్క్యూట్

Satyam NEWS

ధర్మారెడ్డి ని సస్పెండ్ చేయాలని జనసేన డిమాండ్

Satyam NEWS

ముగ్గురు పాకిస్థానీ మాదకద్రవ్యాల స్మగ్లర్ల కాల్చివేత

Satyam NEWS

Leave a Comment