39.2 C
Hyderabad
March 29, 2024 16: 05 PM
Slider ఆధ్యాత్మికం

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

#tiruchanoor

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం రథోత్సవం కన్నులపండుగ‌గా జరిగింది. ఉదయం 7.10 గంటలకు  ర‌థోత్స‌వం మొద‌లై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు  సిద్ధిస్తాయని విశ్వాసం.

 రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12  గంటల నుండి రథమండపంలో  అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

Related posts

అమెరికా దాడితో భగ్గుమన్న ఇరాన్ పెట్రోల్

Satyam NEWS

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్య అధికారి

Satyam NEWS

ఆకతాయిగా తిరుగుతున్న కాలేజీ విద్యార్థులకు కౌన్సిలింగ్

Satyam NEWS

Leave a Comment