28.6 C
Hyderabad
September 20, 2020 14: 01 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

#TirumalaBalajee

తిరుమల శ్రీవారికి సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు వార్షి‌క బ్రహ్మోత్సవాలు, అక్టోబ‌రు 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే న‌వ‌రాత్రి  బ్రహ్మోత్సవాల‌ను పురస్కరించుకుని సెప్టెంబరు 15వ తేదీ మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. 

కోవిడ్ – 19 నిబంధ‌న‌లకు అనుగుణంగా ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించ‌నున్నారు.

Related posts

మద్యం కేసులు పెట్టి మూడేళ్లు బయటకు రానివ్వరు

Satyam NEWS

నారాయణ నారాయణా ఏమిటీ ఆన్ లైన్ వేధింపులు?

Satyam NEWS

వచ్చే నెల 9న జైల్ భరో కార్యక్రమం విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!