36.2 C
Hyderabad
April 18, 2024 12: 44 PM
Slider ఆధ్యాత్మికం

ముత్యపుపందిరి వాహనంపై శ్రీ‌ మలయప్ప స్వామి

#LordBalajee

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆది‌వారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై రుక్మిణి స‌త్య‌భామ స‌మేత మురళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

ముత్య‌పు పందిరి – స‌క‌ల సౌభాగ్య సిద్ధి

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం.

మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది.

ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు క‌ల్ప‌వృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

Related posts

ఫ్రెండ్స్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు

Satyam NEWS

NTR: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మూడక్షరాలు

Satyam NEWS

ఉత్తరాఖాండ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ అరెస్టు

Satyam NEWS

Leave a Comment