27.2 C
Hyderabad
December 8, 2023 17: 24 PM
Slider ఆధ్యాత్మికం ముఖ్యంశాలు

ప్రదర్శనకు తిరుమల శ్రీవారి ఆభరణాలు

tirupati660-620x413

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్తను తెలియజేసింది. మరి కొద్ది రోజుల్లో తిరుమల స్వామి వారి ఆభరణాలను ప్రదర్శనకు ఉంచనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ మ్యూజియంను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఆ మ్యూజియంను భక్తులు సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు వీక్షించేందుకు త్రీడీ పిక్చర్స్ పెడుతున్నట్లు చెప్పారు. మ్యూజియంలో స్వామివారి 1296 రకాల ఆభరణాలు ఉంచనున్నట్లు చెప్పారు.  మ్యూజియం ఏర్పాటు కోసం ఓ భక్తుడు రూ.40కోట్లు విరాళంగా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్వామి వారి నగల గురించి ఇప్పటి వరకు చాలా మంది కథల రూపంలోనే, ఎవరైనా చెబితేనే విని ఉంటారు. అంతేకానీ ప్రత్యక్షంగా చూసే వీలు మాత్రం ఉండేది కాదు. అందుకే ప్రత్యేకంగా భక్తుల కోసం ఈ ఏర్పాటు చేశారు. నిజంగా ఇది శ్రీవారి భక్తలకు శుభవార్తేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related posts

గాన అమర్ రహే

Satyam NEWS

అక్రమంగా సాయం పొందుతున్న పాస్టర్లపై చర్యకు కేంద్రం ఆదేశం

Satyam NEWS

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటే ఎలా ప్రసన్నా?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!