39.2 C
Hyderabad
April 16, 2024 18: 19 PM
Slider ఆధ్యాత్మికం

సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో సిరులతల్లి

tirupathi

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు శుక్ర‌వారం రాత్రి సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులను క‌టాక్షించారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.


సింహం పరాక్రమానికి, శీఘ్ర గమనానికి, వాహన శక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.


వాహనసేవలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బా రెడ్డి, ఈవో డాక్టర్ కె.స్.జవహర్ రెడ్డి. బోర్డు సభ్యులు డా. చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, డా.నిచ్చిత, జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, విఎస్‌వో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసా చార్యులు, ఏఈవో సుబ్ర‌మ‌ణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.


కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన శ‌నివారం ఉదయం 8 గంటలకు క‌ల్ప‌వృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

Related posts

ప్రధాని మోడీ సీఎం కేసీఆర్…. ఇద్దరూ తోడుదొంగలే

Satyam NEWS

హత్రాస్ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Satyam NEWS

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందచేయడమే లక్ష్యం

Satyam NEWS

Leave a Comment