Slider చిత్తూరు

రైతుగా మారిన తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ ర‌మేష్ రెడ్డి

#Tirupathi Urban SP

ఎగ్రికల్చర్ బిఎస్సీ చదివి ఐఏఎస్ అయిన తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ ర‌మేష్ రెడ్డి తాను చదువుకున్న రోజులను, చదువుకున్న సబ్జెక్టును మర్చిపోలేదు. లాక్ డౌన్ విధులలో భాగంగా ఏర్పేడు ప్రాంతంలో బందోబస్తు డ్యూటీలో ఉండగా వేంకటగిరి రహదారి పక్క పొలంలో కొంత మంది వరి నార్లు వేస్తున్నారు.

ఇది గమనించిన జిల్లా యస్.పి వెంటనే తన వాహనం ఆపి రైతుల వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు అడిగారు. తాను కూడా రైతు కూలీగా మారిపోయారు. వారి వద్ద నుండి వరి నారు కట్టను తీసుకొని తానూ కూడా నాట్లు వేయడం మొదలెట్టారు.

ఇది గమనించిన మిగతా వారు కూడా ఆనందంతో ఎస్పీతో  కలసి నారు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మా తాతల కాలం నుండి వ్యవసాయం చేసేవారు. నేను అగ్రికల్చర్ బి.యస్.సి చేసాను. నేను కూడా రైతు బిడ్డనే, మన మందరం ఈ రోజు మంచి ఆహారం తీసుకుంటున్నామoటే అది కాయా కష్టం పడి పండిస్తున్న రైతులవల్లే. ప్రపంచమంతా కరోనా మహమ్మారి కమ్మేసి వున్న సమయంలో కూడా పచ్చని గ్రామ వాతావరణంలో చిరు నవ్వుతో తన కష్టాన్ని మరచి రైతులు కష్ట పడటం చూస్తూ వుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు.

చదువురాని వారు మాత్రమే చేసేది కాదు వ్యవసాయం

వ్యవసాయం అనేది ఎవరో చదువురాని వారు, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారు చేసే పని అని అనుకుంటున్నారు, అదికాదు. మంచి ఆహారం – మంచి ఆరోగ్యం – మంచి దేశం అనే ధ్యేయంతో మనమందరం వారికి తోడ్పాటు ఇవ్వాలి. స్థాయితో సంబంధం లేకుండా మన మందరం మంచి ఆహారం తింటున్నాం. మనలో సహాయం చేసే వారు కూడా ఉన్నారు.

సినిమాలకు వెళ్లే బదులు పొలాలకు వెళ్లండి

నా సూచన ఏమిటంటే  సంవత్సరంలో కొన్ని రోజులు తన సొంత ఊరికి వచ్చి గాని, మీ చుట్టూ ప్రక్కల గ్రామాల రైతుల వద్దకు వెళ్లి వారి బాధ సాధకాలను తెలుసుకొని మన వంతు సహకారం అందిస్తే బాగుంటుంది. వీలైతే వారాంతరపు దినాలలో సినిమాలకు, షికార్లకు పోయే బదులు మీ సొంత గ్రామాలకు వెళ్లి రైతాంగానికి తోడ్పాటునిస్తే సంతోషంగా ఉంటుంది అని అన్నారు.

చదువుకున్న యువత వ్యవసాయం మీద దృష్టా సారిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేనే కాదు నా బిడ్డలు కూడా రాబోయే కాలంలో వ్యవసాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు ఇలా ఇక్కడ రైతులు, రైతు కూలీలను కలుసుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు. ఇలాంటి పోలీసు అధికారులు కదా దేశానికి కావాల్సింది?

Related posts

శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి: సర్వ లోకాల సృష్టికర్త విశ్వకర్మ

Satyam NEWS

హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఉచిత మల్టిస్పెషలిటీ వైద్య శిబిరం

Satyam NEWS

దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా జమ్మికుంట

Satyam NEWS

Leave a Comment