27.7 C
Hyderabad
April 25, 2024 07: 51 AM
Slider చిత్తూరు

భూ తగాదాలు, సెటిల్ మెంట్లలో పోలీసులు జోక్యం చేసుకోవద్దు

#tirupati police

ప్రజలకు జవాబుదారి తనంగా ఉండాలని, మనం ఎంతవరకు న్యాయం చేశామనే విధంగా ఎవరి వారి భాధ్యతలు నిర్వహించాలని తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి.  వెంకట అప్పల నాయుడు అన్నారు. నేడు ఆయన యస్.వి యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు అర్బన్ జిల్లా పోలీస్ అదికారులతో  నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

నమోదైన కేసులను త్వరగాతిగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆయన సూచించారు. కేసు పరిశోధన విషయంలో పోటీతత్వం ఉండాలని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను భూ తగాదాలు, సివిల్ కేసులు, సెటిల్మెంట్ విషయాలలో సంబందం లేదని, ఎవరు ఇలాంటి విషయాలలో ప్రమేయం ఉండకూడదని ఆయన చెప్పారు.

అతిక్రమిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు అని ఆయన తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో భద్రత పెంచాలి, అక్కడ భద్రత కల్పిస్తే జిల్లా మొత్తం పటిష్ట భద్రత ఉన్నట్లే, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదు.

తిరుమల విషయంలో అధికారులు మేల్కొలుపుగా ఉండాలి. ప్రతి చిన్న కేసు విషయాన్ని కూడా పెద్దదిగా చూసి పరిశోధన చేయాలి అని ఆయన కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్ ఇ.సుప్రజ, L&O అరిఫుల్లా, తిరుమల మునిరామయ్య, డి.యస్.పి లు, సి.ఐ.లు, యస్.ఐ లు పాల్గొన్నారు.

Related posts

హెల్ప్ చేయాల్సిన హోం గార్డే బాలికను కాటేశాడు

Satyam NEWS

ఇన్ వెన్షన్: కరోనా రోగులకు కొత్త ట్రీట్ మెంట్ వచ్చేస్తున్నది

Satyam NEWS

జూపల్లి రోడ్‌షో

Bhavani

Leave a Comment