Slider జాతీయం

ప్రియాంక గాంధీని ఇరికించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

#Priyanka Gandhi

వలస కూలీల సమస్యను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యంత ఘోరంగా విఫలమయ్యారని నిరూపించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. అందులో భాగంగానే వలస కూలీలపై అత్యంత ప్రేమ ఉన్నట్లు చెప్పేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా ఇప్పుడు తెల్లమొహం వేసే పరిస్థితి వచ్చింది.

వలస కూలీల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని చెబుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస కూలీలను తీసుకురావడంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి తాను వెయ్యి బస్సులు ఇస్తానని ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు.

వాస్తవానికి ఏ రాష్ట్రం చేయని విధంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సుమారుగా 800 ప్రత్యేక రైళ్లు తమ రాష్ట్రంలోని వివిధ రైలు స్టేషన్లలో ఆగేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కప్పిపుచ్చి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయడం లేదని చెప్పేందుకు ప్రియాంకాగాంధీ వాద్రా ఈ ఆఫర్ ఇచ్చారు.

సాధారణంగా అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మీరు ఇచ్చేది ఏమిటి మేమే ఏర్పాటు చేస్తాం అని చెబుతాయి. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెరైటీగా ఏం చేసిందో తెలుసా? మేడం ప్రియాంకా గాంధీ మీరు వెయ్యి బస్సులు ఇస్తామని చెప్పారు కదా, తక్షణమే వాటిని ఏర్పాటు చేయండి వలస కూలీలను తీసుకుని వద్దాం అంటూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది.

ఈ మేరకు అధికారికంగా ఉత్తర ప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి ఒక లేఖ ను కూడా ప్రియాంక గాంధీకి రాశారు. తక్షణమే వెయ్యి బస్సులను ఏర్పాటు చేయాలని, వాటి నెంబర్లను, డ్రైవర్ల పేర్లను ఇస్తే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఈ కరోనా సమయంలో ఎంత పెద్ద నాయకుడు అయినా సరే ఒక ప్రయివేటు వ్యక్తి వెయ్యి బస్సులు ఏర్పాటు చేయడం అసాధ్యం. మరి ప్రియాంక గాంధీ వాద్రా ఏం చేస్తుందో చూడాలి.

Related posts

ఏప్రిల్ 15 వరకు ఎవ్వరు కూడా బయటకు రావద్దు

Satyam NEWS

రఘురామ డిమాండ్: వివేకా మర్డర్ కేసులో విజయసాయిని ప్రశ్నించాలి

Satyam NEWS

ప్రవీణ్ కుమార్ అవినీతిపై CBI దర్యాప్తు జరపాలి

Satyam NEWS

Leave a Comment