హైదరాబాద్ చందానగర్ లో నూతన “టైటాన్ ఐ ప్లస్ స్టోర్” ను టైటాన్ కంపెనీ సౌత్ రీజినల్ బిజినెస్ హెడ్ అజయ్ ద్వివేదీ ప్రారంభించారు. టైటాన్ కంపెనీ సౌత్2 రీజినల్ బిజినెస్ మేనేజర్ విబోర్ సోలంకి, వివిసి గ్రూపుల ఎండి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, గట్టు గోపాల్ రెడ్డి, చందానగర్ నూతన టైటాన్ ఐ ప్లస్ స్టోర్ ఫ్రాంఛైజీ పార్టనర్, జెపి ఎంటర్ ప్రైజెస్ ఎండి కొండవీటి అమర్ చౌదరి, టైటాన్ ఐ ప్లస్ ప్రతినిధులు మేఘ్నాధ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న చందానగర్ ప్రాంతంలో నూతన టైటాన్ ఐ ప్లస్ స్టోర్ ను ప్రారంభించేందుకు ఫ్రాంఛైజీ పార్టనర్ కొండవీటి అమర్ చౌదరి ముందుకురావడం అభనందనీయమని అజయ్ ద్వివేదీ, విబోర్ సోలంకి ఈ సందర్భంగా అన్నారు.
టైటాన్ ఐ ప్లస్ స్టోర్ లో అన్ని వర్గాలవారికి, అన్ని వయస్సులవారికి అందుబాటు ధరలలో వివిధరకాల కళ్ళజోళ్ళు అందుబాటులో వున్నాయన్నారు. టైటాన్ కంపెనీ కళ్ళజోళ్ళతో పాటు వివిధ అంతర్జాతీయ బ్రాండ్ల కళ్ళజోళ్ళు కూడా చందానగర్ నూతన స్టోర్ లో అందుబాటులో వున్నాయన్నారు. బ్లూటూత్ అవసరం లేకుండానే ఫోన్ ను కళ్ళజోడు ద్వారా ఆపరేట్ చేసే నూతన కళ్ళజోళ్ళు కూడా ఈ స్టోర్ లో లభ్యమవుతున్నాయన్నారు. జెపి ఎంటర్ ప్రైజెస్ ప్రారంభించిన నూతన స్టోర్ మరింత అభివృద్ధి చెందాలని వివిసి రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు. స్టోర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులందరికీ జెపి ఎంటర్ ప్రైజెస్ ఎండి కొండవీటి అమర్ చౌదరి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ స్టోర్ లో అందరికీ ఉచిత కంటి పరీక్షలు అందుబాటులో వున్నాయని ఆయన చెప్పారు.