ఎన్నికల సందర్భంగా సొంత జిల్లాల నుంచి బదిలీ అయిపోయిన రెవెన్యూ అధికారులను తిరిగి యధాతథ స్థితికి తీసుకువస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో భాగంగా కూకట్ పల్లి మండలానికి పి.సంజీవరావు మళ్లీ ఎంఆర్ఓ గా నియమితులయ్యారు. ఎంఆర్ఓగా నియమితులైన సంజీవరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా TMRPS అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మాదిగ అభినందనలు తెలిపారు. కూకట్ పల్లి, బాలానగర్ మండలం కలసి ఉమ్మడిగా ఉన్నప్పుడు సంజీవరావు చేసిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సుమారు 8 సంవత్సరాల పాటు ఉమ్మడి మండలంలో ఆయన సేవలు అందించిన సమయంలో పేద ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉండేవారని శ్రీనివాస్ మాదిగ తెలిపారు. మళ్లీ ఆయన తిరిగి కూకట్ పల్లి మండలానికి రావడం తాము ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
previous post