31.2 C
Hyderabad
April 19, 2024 04: 11 AM
Slider మహబూబ్ నగర్

హెల్తీ హార్ట్: గుండె జబ్బులు పెరగడానికి కారణాలెన్నో

ramkishan

మారుతున్న పరిస్థితులలో మెరుగైన ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చునని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. ప్రసాద్ రావు వెల్లడించారు. అమ్రాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఇండో – యుఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె పరీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 157 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన  ప్రసాద రావు మాట్లాడుతూ పౌష్టికాహార లోపం, వరి, గోధుమ పదార్ధాలను నిరంతరంగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ శాతం పెరిగిపోతున్నదని అన్నారు. దీనికి తోడు సరైన వ్యాయామం లేక పోవడంవల్ల ఈ గ్లూకోజ్ కొవ్వుగా మారి చిన్న వయస్సులోనే గుండె, కిడ్నీ సంబంధ రోగాలు వస్తున్నాయని అన్నారు. ఈ వ్యాధులతో ప్రజలు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లమల ప్రాంతం 30 ఏళ్ళ క్రితం ఆరోగ్య పరంగా బాగున్నవాళ్లు ఇప్పుడు అనారోగ్యం పాలవుతున్నారని ఆయన అన్నారు. మద్యపానం, ధూమపానం, ఇతర మత్తు పదార్థాలను దూరం చేసుకొని ఆరోగ్య పరంగా అభివృద్ది చెందాలని ఆయన తెలిపారు. నల్లమల ప్రజలు గుండె సంబంధ వ్యాధులతో బాధ పడితే ఉచిత చికిత్స నిర్వహించేందుకు తాను ముందుంటానని ఆయన తెలిపారు.

ప్రస్తుత పంటల్లో సారం తగ్గి పౌష్టికాహార లోపం ఏర్పడుతున్నదని మహబుబ్ నగర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాంకిషన్ తెలిపారు. అందువల్లే వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. ప్రాచీన ఆహార ధాన్యాలైన, గ్లూకోజ్ శాతం తక్కువ కలిగిన సిరి ధాన్యాల వాడకం ద్వారా ప్రస్తుతం వచ్చే రోగాలను దూరం చేసుకోవచ్చని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, వైద్యులు, స్థానిక ప్రజా సంఘాల నాయకులు కల్ముల నాసరయ్య, కుంద మల్లి ఖార్జున్, బి.లింగం, డా. వెంకటయ్య, అంజనేయులు, రాంకోటి, గోపాల్, అంభేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జక్క బాలకిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏలోపింగ్ టీచర్: ఆమెకు 26 అతనికి 14 లేచిపోయారు

Satyam NEWS

గరుడ వాహన సేవలో సౌమ్యనాధ స్వామి….

Satyam NEWS

వనపర్తిలో పెట్రోల్ బాంక్ సీజ్

Satyam NEWS

Leave a Comment