Slider తెలంగాణ

మాకే మద్దతు ఇవ్వండి:సిపిఐకి కాంగ్రెస్ వినతి

pjimage (3)

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని పోటీలు పడిమరీ సిపిఐని కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కోరుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే సిపిఐ నేతలను కలిసి మద్దతు కోరగా నేడు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అదే పని చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం కోదండరెడ్డి నేడు కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. సీపీఐ, కాంగ్రెస్ ల మధ్య సిద్దాంత పరంగా విభేదాలు లేవని, దేశ ,రాష్ట్ర ల అభివృద్ధి  కోసం అనేక సార్లు కలసి పనిచేసామని ఈ సందర్భంగా కోదండరెడ్డి గుర్తు చేశారు. యూపిఏ హాయాంలో పార్లమెంట్ లో అనేక బిల్లులకు సీపీఐ మద్దతు ఇచ్చిందని, 2004 కమ్యూనిస్టు పార్టీ తో మాట్లాడి దేశంలో ని అనేక సమస్యలు పరిష్కరించాం మని ఆయన తెలిపారు. చిన్న చిన్న సమస్యలు మా పార్టీ ల  మధ్య  ఉండొచ్చు, అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నిక చాలా కీలకమైంది, ఈ సందర్భంగా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కు సీపీఐ మద్దతు ఇవ్వాలని కోరాం అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అనేక సార్లు కాంగ్రెస్ తో కలసి పనిచేసామని, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పనిచేసాం కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సరికి కూటమి విడిపోయింది. అన్ని పార్టీ లు  మద్దతు అడుగుతుంటె మేము కూడా పోటీ చేసి ఉంటె భాగుండు అనిపిస్తుంది. రేపు రాష్ట్ర కార్యవర్గ భేటీ లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు. మేము సిద్దాంతాలు కు అనుగుణంగా పనిచేస్తున్నాం కాబట్టే ఆటు పోట్లు ఎదుర్కొంటుంన్నాం అని ఆయన తెలిపారు

Related posts

ములుగు ఎస్ పిని కలిసిన సీఐ రవీందర్

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలి

Satyam NEWS

మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!