35.2 C
Hyderabad
April 20, 2024 15: 10 PM
Slider తెలంగాణ

నేడు హ‌స్తిన ప‌ర్య‌ట‌నకు రేవంత్ రాహుల్‌తో భేటీ!

Revanth1

హ‌స్తం పార్టీ తెలంగాణ రాష్ర్టంలో ఉనికిని పూర్తిగా కోల్పోయిన నేప‌థ్యంలో ఆ పార్టీ పీసీసీ ప‌ద‌వికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో రేవంత్‌రెడ్డిపై ప్ర‌జ‌ల్లో కాస్తో కూస్తో న‌మ్మ‌కం ఉన్న‌ప్ప‌టికీ… కాంగ్రెస్‌లో ఆది నుంచి వేళ్లూనుకున్న ప‌లువురు సీనియ‌ర్లు ఆయ‌న్ను ముందుకు రానీయ‌డంలేద‌నే వాద‌న‌లున్నాయి. అంతేగాకుండా ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డి కాకుండా పీసీసీ చీఫ్ ప‌ద‌వికి సుమారు అర‌డ‌జ‌ను మంది నేత‌లు క్యూలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

పీసీసీ చీఫ్‌పైనే చ‌ర్చ‌లా?

ఈ నేప‌థ్యంలో రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు. రేవంత్‌రెడ్డి భేటీపై స‌ర్వ‌త్రా పార్టీ వ‌ర్గాల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే హ‌స్తానికి రెండే రెండు ఇటీవ‌ల ఎన్నిక‌ల్ల కార్పొరేట‌ర్ ప‌ద‌వులు ద‌క్కాయంటే అదీ రేవంత్‌రెడ్డి చ‌ల‌వేన‌ని చెప్ప‌క‌నే చెప్పొచ్చు. ఆయ‌న్ను జీహెచ్ఎంసీలో ముందుకు సాగ‌నీయ‌లేద‌ని లేకుంటే కాంగ్రెస్ పార్టీ త‌మ హ‌స్త‌లాఘావాన్ని ప్ర‌ద‌ర్శించేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. కాగా రేవంత్ ప‌ర్య‌ట‌న రాహుల్‌గాంధీతో భేటీ పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోస‌మేనా అనే చ‌ర్చ‌లు కాంగ్రెస్ నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌జాస‌ర్వేల్లో రేవంత్‌రెడ్డి టాప్‌!

కాగా, పీసీసీ చీఫ్ ప‌ద‌వికి అర్హుడెవ‌ర‌ని మీడియాలోనే గాకుండా గ‌త కొద్దిరోజుల నుంచి ప్ర‌జ‌ల్లోనూ వినిపిస్తున్నవాద‌న‌కు చాలామంది ప్ర‌జ‌లు (నేత‌లు కాదు..!) రేవంత్‌రెడ్డి పేరునే సెలెక్ట్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో అన్ని ప‌రిణామాల‌ను ప‌రిశీస్తున్న అధిష్టానం కాస్త ఏం నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే ఆస‌క్తి నెల‌కొంది. మ‌రోవైపు ఒక‌వేళ రేవంత్‌రెడ్డిని పీసీసీ ప‌ద‌వికి ఎన్నిక చేస్తే ఆ పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు కాస్త ప‌క్క‌దారి ప‌ట్టే అవ‌కాశం లేక‌పోలేదు. ఇక పీసీసీ ప‌ద‌విపై హ‌స్తం పార్టీ జాతీయ అధిష్టానం ఏం నిర్ణ‌యం తీసుకుంటుంది? ఆ నిర్ణ‌యం ఏ విధంగా ఉండ‌బోతోంద‌న్న‌ది మాత్రం తీవ్ర ఉత్కంఠ‌ను రేపుతుంద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

అధిష్టానానికి చేరిన ఠాగూర్ నివేదిక‌!

ఇప్ప‌టికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ 200 మంది నేతలను సంప్రదించి పీసీసీ చీఫ్ ప‌ద‌వికి అర్హుడిగా భావిస్తున్న ఓ నేత పేరును ర‌హాస్య నివేదిక రూపొందించి అధిష్టానికి చేర‌వేశార‌ని స‌మాచారం. అయితే అన్ని అర్హతలు ఉన్నవారికే టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలని నేతలు మాణిక్యం ఠాగూర్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రేవంత్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న కాస్త హ‌స్తం వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related posts

ఈ కమిటీలు మెంటల్ ఆసుపత్రి నుంచి వచ్చాయా?

Satyam NEWS

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో సజావుగా నవోదయ ప్రవేశ పరీక్ష

Satyam NEWS

Leave a Comment