ప్రధాని నరేంద్రమోడీ నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గుజరాత్లోని సర్దార్ సరోవర్ జలాశయాన్ని ప్రధాని సందర్శించనున్నారు. అనంతరం ‘నమామి దేవి నర్మదా’ ఉత్సవాన్ని ప్రారంభించి.. నర్మదా జిల్లా కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు ప్రధాని జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా జరిపేందుకు బిజెపి ఏర్పాట్లు సిద్ధం చేసింది. చాలా ప్రాంతాలలో మోడీ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి.
previous post