37.2 C
Hyderabad
March 29, 2024 19: 59 PM
Slider కర్నూలు

శ్రీశైలంలో భక్తుల ఉచిత సేవలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు

#srisailam

శ్రీశైలం మహా క్షేత్రంలో శివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి తెలుపుకోవచ్చని నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

భక్తులు త్రాగునీరు, వైద్య సదుపాయం, ట్రాఫిక్ తదితర అత్యవసర సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్లు 08524-287004, 08524-287288, 08524-287289 లకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే తదుపరి చర్యలు గైకొంటామని కలెక్టర్ తెలిపారు. భక్తులు అసౌకర్యానికి గురైన, పాదయాత్రలో అవాంతరాలు ఏర్పడినా, బంధు మిత్రులు తప్పిపోయిన,

ప్రమాదవశాత్తు వైద్య సహాయం తదితర అత్యవసర సేవల నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే సంబంధిత శాఖలకు సమాచారాన్ని చేరవేసి అవసరమైన సహాయాన్ని అందించేందుకు వీలుగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులు అసౌకర్యానికి గురైనప్పుడు అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

పుష్ప సినిమాతో మంచి గుర్తింపు లభించింది: నటి అక్షర

Satyam NEWS

తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా దుర్గాప్రసాద్

Satyam NEWS

తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment