24.7 C
Hyderabad
March 29, 2024 05: 55 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రేపు

#TirumalaBalajee

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.

బ్ర‌హ్మోత్స‌వాల కోసం సెప్టెంబర్ 18న శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మ‌ధ్య‌ అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా శ్రీ విష్వ‌క్సేనుల వారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేస్తారు.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు.

వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది.

అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది.

సెప్టెంబర్ 19న ధ్వజారోహణం

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 19వ తేదీ శ‌నివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.

ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ ఉంటుంది.

Related posts

పోలీసుల దౌర్జన్యంపై ఎడ్లబండ్ల యజమానుల నిరసన

Satyam NEWS

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి పుట్టిన రోజున మెగా బ్లడ్ క్యాంప్

Satyam NEWS

తిరుమల తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? ఇది చదవండి

Satyam NEWS

Leave a Comment