39.2 C
Hyderabad
March 29, 2024 13: 56 PM
Slider ప్రత్యేకం

సైబర్ నేరాలపై ఫిర్యాదుల నెంబర్ ఇక 1930

#cybercrime

సైబర్‌ నేరాల ఫిర్యాదులు స్వీకరించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నంబరు 155260 మారింది. ఇకపై ‘1930’ టోల్‌ఫ్రీ నంబరుగా కొనసాగనుంది. ఇప్పటివరకూ పనిచేస్తున్న నంబరును డయల్‌ చేసేందుకు అసౌకర్యంగా ఉందంటూ వేలమంది బాధితులు వివరించడంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్‌ విభాగాలు, ఐటీ నిపుణులతో చర్చించి ‘1930’ను ఖరారు చేశారు. రెండు, మూడురోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ నంబరును ప్రచారం చేస్తున్నారు. కొందరు బాధితులు సోమవారం 155260 నంబరుకు ఫిర్యాదు చేయగా కొత్త నంబరుకు చేయాలని సూచించారు.

Related posts

గృహ సారథులను, కన్వీనర్లను రద్దు చేయాలి

Satyam NEWS

గిరిజనుల మనోభావాలపై కేంద్రం దెబ్బ

Sub Editor 2

కేర్ ఫుల్: ఇంటిలోకి కరోనా రాకుండా ఏం చేయాలంటే

Satyam NEWS

Leave a Comment