36.2 C
Hyderabad
April 25, 2024 19: 24 PM
Slider ప్రత్యేకం

అసలు విషయం చెప్పింది సత్యం న్యూస్ ఒక్కటే

satyamnews 111

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త కమిషనర్ నియామకంపై అత్యంత కీలక విషయాలను సత్యం న్యూస్ మాత్రమే బయట పెట్టింది. మిగిలిన మీడియా వెలుగులోకి తీసుకురాని అత్యంత కీలకమైన ఆ రెండు విషయాలు ఏమిటంటే

1. హైకోర్టు జడ్జి హోదా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.2. అత్యంత గోప్యంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్లు 617, 618 అనే రెండు విషయాలను సత్యం న్యూస్ వెలుగులోకి తెచ్చింది.

దీనిపై విశ్లేషణ కూడా సత్యం న్యూస్ అందించింది. ఈ రెండు అత్యంత కీలక విషయాలపై పూర్తి సమాచారం ఉన్న సత్యం న్యూస్ ఆ తర్వాత దీనికి సంబంధించిన వార్తలను పోస్టు చేయలేదు. పత్రికలు, టీవీ ఛానెళ్లు అన్నీ కూడా ఎన్నికల కమిషనర్ గా  రామ సుందర రెడ్డి అనే ఐఏఎస్ అధికారిని నియమించినట్లు వార్తలు విడుదల చేసేసి వాటిపై చర్చలు కూడా పెట్టారు.

అయితే సత్యం న్యూస్ ఆ వార్తను పోస్టు చేయలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరించడమే కాకుండా అందరిని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించింది.

అధికారికంగా ఎలాంటి సమాచారం లీక్ కాకుండా చూసుకుని మీడియా మొత్తాన్ని ఫూల్స్ ను చేసే విధంగా పకడ్బందిగా మిస్ లీడింగ్ వార్తల్ని లీక్ చేసింది. ఆ వలలో అన్ని మీడియా సంస్థలు చిక్కుకున్నాయి. జస్టిస్ వి.కనగరాజ్‌ వచ్చి పదవీ స్వీకారం చేసే వరకూ అత్యంత గోప్యంగా జరిగింది. 617, 618 జీవోలను నిన్న అర్ధ రాత్రి పబ్లిక్ డొమైన్ లో రాష్ట్ర  ప్రభుత్వం ఉంచింది. అప్పటికే పత్రికల పబ్లికేషన్ టైమ్ అయిపోయింది.

Related posts

దేశంలోనే అద్భుతమైన పథకం కళ్యాణ లక్ష్మీ

Satyam NEWS

మేడిపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Satyam NEWS

ఎవేర్నెస్: కోవిడ్ 19 వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుందాం

Satyam NEWS

Leave a Comment