40.2 C
Hyderabad
April 19, 2024 15: 55 PM
Slider జాతీయం

సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తేనే కరోనా వైరస్ అదుపు

#coronalockdown

రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులను అదుపు చేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తొపే అన్నారు.

రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తి లాక్ డౌన్ విధిస్తే తప్ప మహారాష్ట్రలో కరోనా కేసులు అదుపు చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

మహారాష్ట్రలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి కూడా ఇంత సమయం అవసరమని ఆయన తెలిపారు.

ప్రస్తుతం విధించిన ఆంక్షలను అందరూ అనుసరిస్తే కేసులు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుందని అప్పుడు లాక్ డౌన్ అవసరం ఉండకపోవచ్చునని ఆయన తెలిపారు.

అయితే చాలా మంది కరోనా వైరస్ ను తేలికగా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోగ్య మంత్రి తెలిపారు.

Related posts

రాంకీ సంస్థ నిర్వాకంతో రైతన్నల గగ్గోలు

Satyam NEWS

ఎట్టకేలకు కళ్లు తెరచిన తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS

ముఖేష్ అంబానీ కుటుంబానికి ఇక Z+ భద్రత

Satyam NEWS

Leave a Comment