31.2 C
Hyderabad
April 19, 2024 06: 23 AM
Slider ప్రత్యేకం

మీ అందరు పోతరు…కమిషనర్‌‌ని ఫోన్‌లోనే కడిగేసిన టీపీసీసీ చీఫ్

#PCC Chief

ఎల్బీనగర్ పరిధిలోని సాహెబ్ నగర్‌లో హ్యాన్‌హోల్‌లో దిగి చనిపోయిన సఫాయి కార్మికుడి కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇంతవరకూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్‌హోల్‌లో దిగి మరణించిన శివ కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్.. అక్కడి నుంచే కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇంతవరకూ అధికారులెవరూ పట్టించుకోకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు కానీ, జీహెచ్‌ఎంసీ అధికారులు కానీ వచ్చిన దాఖలాల్లేవని ఆయన అసహనం వ్యక్తం చేశారు

మ్యాన్‌హోల్‌లో దిగడం 2013లోనే నిషేధించారని.. అయినా దించినందుకు మీ అందరూ పోతరని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. శివ, ఆచూకీ తెలియని అంతయ్య ఇద్దరివీ నిరుపేద కుటుంబాలని.. ప్రభుత్వం నుంచి వీలైనంత సాయం అందేలా చూడాలని రేవంత్ ఆదేశించారు. కమిషనర్ ఫోన్ ఎత్తడం లేదని.. ఎంపీ కాల్ చేస్తే ఫోన్ ఎత్తి విషయం చెప్పాలని నా తరఫున చెప్పమని వార్నింగ్ ఇచ్చారు. తాను జనంతో వస్తే కానీ మీరు దిగొస్తరని ఆయన మండిపడ్డారు.

వెంటనే రెండు కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కమిషనర్‌ని కోరారు. అనంతరం ఏడు నెలల గర్భిణి అయిన శివ భార్యకి భరోసానిచ్చారు. ఆమెకు తన వంతు సాయంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు డెలివరీ అయ్యే వరకూ ఆస్పత్రి ఖర్చులు తామే చూసుకుంటామన్నారు. అక్కడి నుంచే డాక్టర్‌కి ఫోన్ చేసి విషయం వివరించారు. ఆమెకు ప్రసవం అయ్యే వరకూ అన్నీ మనమే చూసుకోవాలని.. మందులకి కూడా ఒక్క రూపాయి కూడా బిల్లు వేయొద్దని కోరారు. ఏమైనా అవసరమైతే స్థానిక నాయకుల ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు.

Related posts

32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ

Satyam NEWS

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించండి

Satyam NEWS

ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment