34.2 C
Hyderabad
April 23, 2024 13: 55 PM
Slider నల్గొండ

ప్రైవేటు టీచర్ లను ప్రభుత్వం ఆదుకోవాలి

#Prof.Kodandaram

ఆరు నెలలుగా జీతాలు లేక ప్రైవేటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని TPTF సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టే నాగరాజు యాదవ్ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ప్రొఫెసర్ కోదండరాం ని కలిసి ఆయన  ప్రైవేట్ టీచర్ల సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఫ్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని కోదండరాం కు వివరించారు.

లాక్ డౌన్ సమయానికి సంబంధించి (జీవో నెం 45, 1897 ఎపిడమిక్స్ డిసీజేస్ ఆక్ట్ ప్రకారం)  టీచర్లకు, నాన్ టీచింగ్ సిబ్బందికి  యాజమాన్యాలు పూర్తి వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు.

ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, కరోనా భృతి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు.

ప్రయివేటు టీచర్లకు ESI, EPF, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ టీచర్లకు 12 నెలల జీతం ఇవ్వాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో  పయ్యావుల ప్రకాష్ , కోల్లపుడి రవి,సురేందర్ రెడ్డి, జక్కుల మల్లికార్జున్, ఇందిరాల శ్రీనివాస్, జక్కుల సైదులు, భూపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, కుమార్ ,వీరస్వామి, ఆనంద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బర్నింగ్ ఢిల్లీ: పౌరసత్వ చట్టంపై ఆగని ఆందోళనలు

Satyam NEWS

కొల్లాపూర్ ఎమ్మెల్యే తల్లి విరాళం లక్ష రూపాయలు

Satyam NEWS

ఇండియా విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment