40.2 C
Hyderabad
April 19, 2024 16: 44 PM
Slider మహబూబ్ నగర్

ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్

#SandTractor

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మైనార్టీ తీరని 9వ తరగతి చదువుతున్న 16 సంవత్సరాల అబ్బాయి ఇసుక రవాణా చేస్తుండగా కల్వకుర్తి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాంబాబు పట్టుకుని సీజ్ చేశారు.

కల్వకుర్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాంబాబును వివరణ కోరగా శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్ నుండి  వెళుతుండగా ట్రాక్టర్ కు సంబంధించిన ఎలాంటి కాగితాలు, నెంబర్ ప్లేట్, డ్రైవింగ్ లైసెన్స్ లేవని తెలిపారు.

అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నది మైనార్టీ తీరని 16 సంవత్సరాలు వయసు గల విద్యార్థి అని తెలిపారు. ట్రాక్టర్లు సీజ్ చేసి కల్వకుర్తి బస్ డిపో లో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

కొత్త చట్టం  ప్రస్తుతం అమలు కాలేదని ఏప్రిల్ 2021 నుండి  అమలవుతుందని, అప్పుడు వారి తల్లిదండ్రులను కౌన్సిలింగ్, అపరాధ రుసుము, జైలు శిక్ష మొదలగు కొత్త చట్టం ప్రకారం శిక్షలు వర్తిస్తాయని తెలిపారు.

Related posts

ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా

Satyam NEWS

వ్యాక్సిన్ రాలేదు కాబట్టి ముందు జాగ్రత్తలే ముఖ్యం

Satyam NEWS

ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్ధికంగా ఆదుకునే బడ్జెట్

Satyam NEWS

Leave a Comment