39.2 C
Hyderabad
April 25, 2024 18: 44 PM
Slider విజయనగరం

పోలీసుల అదుపులో ట్రాక్టర్లు చోరి నిందితులు…!

#vijayanagarampolice

విజయనగరం జిల్లాలో ట్రాక్టర్లు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి ఒక ట్రాక్టర్ ఇంజన్, మూడు ట్రాక్టర్ ట్రక్కులు 4.50 లక్షల నగదును రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక వివరాలను తెలిపారు. ఇటీవల జిల్లాలో ఎస్.కోట, ఎల్.కోట, జామి, డెంకాడ మరియు విజయనగరం రూరల్ పోలీసు స్టేషను పరిధిలో జరిగిన ట్రాక్టరు దొంగతనాలను దృష్టిలో పెట్టుకొని, ఈ తరహా నేరాలను నియంత్రించుటకు, కేసుల మిస్టరీని చేధించుటకుగాను విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిసిఎస్, జామి ఎస్.కోట పోలీసులతో ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేసామన్నారు.

ఈ బృందాలు ఈ తరహా నేరాలకు పాల్పడిన నేరస్థులను రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేసి, అనుమానస్పద వ్యక్తులపై నిఘా పెట్టారన్నారు. జామి మండలం అలమండ రైల్వే స్టేషను సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న  శ్రీకాకుళపు నాగరాజు  అనే వ్యక్తిని జామి పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ చేయగా, తాను మరియు కొత్తవలస మండలం వియ్యంపేటకు చెందిన నాగులాపల్లి గణేష్  మరియు మరో జువినల్ సహకారంతో బృందంగా ఏర్పడి, ఊరికి చివరగా ఉన్న వ్యవసాయ కళ్ళాల్లో ఉన్న పాత ట్రాక్టర్లును దొంగిలించి, వాటి రూపు రేఖలు మార్పులు చేసి, స్క్రాప్ షాపులకు విక్రయించే వారన్నారు.

నిందితులు ఇటుక బట్టీల్లో పని చేస్తూ, బట్టీ యజమానుల వద్ద నుండి అడ్వాన్సుగా డబ్బులు తీసుకొని, తిరిగి చెల్లించకపోవడంతో అప్పులబారిన పడ్డారన్నారు. ఈ అప్పుల నుండి బయట పడేందుకు జామి మండలంలో ఒకటి, ఎస్.కోట మండలంలో రెండు, ఎల్. కోట మండలంలో ఒకటి, డెంకాడ మండలంలో ఒకటి, విజయనగరం మండలంలో మరొకటి మొత్తం ఆరు ట్రాక్టర్లును దొంగిలించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడించారన్నారు. ఈ కేసుల్లో నేరస్థుడైన నాగులాపల్లి గణేష్ ను కూడా అరెస్టు చేసి, వారి వద్ద నుండి ఒక ట్రాక్టరు ఇంజను, మూడు ట్రాక్టరు తొట్టెలు, ట్రాక్టర్లును స్క్రాప్ షాపులకు విక్రయించిన నగదులో 4.50 లక్షలను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు.

వీరు పాల్పడిన నేరాల్లో మరో ట్రాక్టరును (విజయనగరం రూరల్ పిఎస్ కు చెందినది) కడపకు చెందిన బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి నుండి ఇంకనూ రికవరీ చేయాల్సి ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ నిందితుల అరెస్టుతో ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేసామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

ఈ ఆరు కేసుల్లో జామి ఎస్ఐ జి.వీరబాబు, సిసిఎస్ ఎస్ఐ బి. సాగరబాబు, ఎస్.కోట ఎస్ఐ జె. తారకేశ్వరరావు, సిసిఎస్ ఎఎస్ఐ ఎ.గౌరీ శంకరరావు, హెడ్ కానిస్టేబుళ్ళు దాసరి శంకరరావు, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్, జి.మహేశ్వరరావు, ఎస్.ఈశ్వరరావు, కానిస్టేబుళ్ళు ఎం. చిరంజీవి రాజు, ఎస్.రమణ, ఎన్.గౌరీ శంకర్, హెూంగార్డు జె. నారాయణరావులు ఎంతో శ్రమించి, ఈ కేసుల మిస్టరీని చేధించారని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐ జి.రాంబాబు, ఎస్ఐలు జి.వీరబాబు, బి. సాగరబాబు, ప్రశాంతకుమార్, నజీమా బేగం ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఏడేళ్ల హరితహారానికి రూ.10వేల కోట్లు ఖర్చు

Bhavani

క‌మ‌ల‌నాధులు ఒత్తిళ్లే..బ‌దిలీకి కార‌ణ‌మా..?

Satyam NEWS

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

Murali Krishna

Leave a Comment