27.7 C
Hyderabad
April 19, 2024 23: 34 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ మున్సిపాలిటీలో వారికి లైసెన్స్ లేకుంటే చర్యలు

#kollapurmunicipality

కొల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గా సోంటే రాజయ్య వచ్చినప్పటి నుండి మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలను అమలు పరుస్తున్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపోతున్నారు.ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ నియమ నిబంధనలు పాటించాలని ఆయన సూచనలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎవరు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎంతటి వారినైనా సరే ఆయన ఉపేక్షించడం లేదు.అయితే ఇపుడు కొల్లాపూర్ మున్సిపాలిటీ కమర్షియల్ వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ లు ఎంతమందికి ఉన్నాయనీ ఆరా తీస్తున్నారు.

వాటిపై రైడ్ లు చేయించడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. దీనిపైన సత్యం న్యూస్ తో కమిషనర్ సొంటే రాజయ్య మాట్లాడారు. మున్సిపాలిటీలో ప్రతి కమర్షియల్ వ్యాపారి ట్రేడ్ లైసెన్స్ పొంది ఉండాలని ఆయన అంటున్నారు.

లేని ఎడల తగిన చర్యలు కూడా తీసుకుంటామని కరాఖండిగా చెబుతున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌లేని దుకాణదారులకు 100 శాతం పెనాల్టీ విధించ బోతున్నట్లు తెలియజేశారు. జరిమానా వేసిన నాటినుంచి ప్రతినెలా 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

లైసెన్స్ ఉన్న వారు నిర్ణీత రుసుము ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ఆటోమేటిక్‌గా ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ అవుతుందని పేర్కొంది. లైసెన్స్ వలన ఉపయోగాలు కూడా ఉన్నాయని కమర్షియల్ వ్యాపారులకు సూచనలు చేస్తున్నారు.20,30 వేలు కిరాయిలు కట్టడానికి సిద్ధంగా ఉంటారు గాని లైసెన్సులు తీసుకోలేకపోతున్నారు.ఇకపై ప్రతి ఒక్కరు లైసెన్స్ పొంది ఉండాలనీ అంటున్నారు. లేనియెడల పెనాల్టీతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ఫ్యామిలీ క్లాష్: మద్యం మరణాలు మొదలు

Satyam NEWS

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిష్ర్కమణ

Satyam NEWS

హిందూ వాహిని ఆధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

Leave a Comment