24.2 C
Hyderabad
December 10, 2024 00: 23 AM
Slider ఆధ్యాత్మికం

సంప్రదాయ విద్య తో వల్లనే సంస్కృతీ వికాసం

traditional 1

సనాతనమైన సంప్రదాయ విద్య బాలబాలికల్లో సంస్కృతి వికాసానికి పునాదిగా నిలుస్తుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బులుసు శివశంకరరావు అన్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి ఆశీస్సులతో ఆదివారం లబ్బీపేట లోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో” సహస్రదళ పద్మారాధన” కార్యక్రమం జరిగింది. జ్యోతి ప్రకాశన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన శివ శంకర రావు మాట్లాడుతూ ఆధునిక విద్య భౌతిక సుఖాలను మాత్రమే ఇస్తుందని, సంప్రదాయ విద్య ఆత్మ శాంతి కలిగిస్తుందన్నారు. ధర్మబద్ధమైన విధానమే జీవిత గమనానికి ఆలంబన కావాలన్నారు. దేవదాయ, ధర్మదాయ శాఖ మాత్యులు వెలంపల్లి శ్రీనివాస రావు పాల్గొని మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులకు దోహదపడతాయని చెప్పారు. దేవస్థానం చైర్మన్ మాగంటి సుబ్రమణ్యం మాట్లాడుతూ బాలల్లో నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక మానవీయ విలువలను పెంపొందింప జేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ తో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, తిరుపతి కేంద్రాలలో ఒకే సమయంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు, కంచి పీఠం నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలల నుంచి విద్యార్థినులు గణేశ పంచరత్నం, గోవిందాష్టకం, గోవింద నామావళి, ఆదిత్య హృదయం, లక్ష్మీ అష్టోత్తరం, నామరామాయణం, అన్నపూర్ణ స్తుతి, వెంకటేశ్వర సుప్రభాతం, సామూహికంగా గానం చేశారు. సంస్కృత పండితులు డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు. తొలుత శ్రీ షణ్ముఖ  వేద విద్యాలయం విద్యార్థులు గురు జానకి రామావధాని నేతృత్వంలో కృష్ణ యజుర్వేద పారాయణం చేశారు. కంచి మఠం ప్రతినిధులు కొంపెల్ల శర్మ, ప్రయాగ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెద్దపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం: పరుగులు తీసిన జనం

Satyam NEWS

బీజేపీ పెట్టిన పోస్టులపై కాంగ్రెస్ నిరసన…!

Satyam NEWS

మానవ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు గా కట్టా సంపత్ కుమార్

Satyam NEWS

Leave a Comment