39.2 C
Hyderabad
March 29, 2024 16: 29 PM
Slider ప్రకాశం

మహానాడు కు వస్తున్న కార్యకర్తలు సూచన

#mahanadu

ఈ నెల 27,28 వ తేదిలలో ఒంగోలు సమీపాన మండువారిపాలెంలో జరిగే మహానాడు కార్యక్రమం దృష్ట్యా వాహనాల రాకపోకలకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా జిల్లా ఎస్పీ ట్రాఫిక్ ఆంక్షలు విధించటమైనది. కావున ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను అనుసరించి పోలీసువారికి సహకరించవలసినదిగా కోరడమైనది.

మహానాడు కార్యక్రమానికి వచ్చే వాహనాల మార్గములు

1. గుంటూరు, విజయవాడ, చీరాల వైపునుండి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్ లో ఎంటర్ ఆయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణు ప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళవలెను.

2. నెల్లూరు, కావలి వైపు నుండి మహానాడుకు వచ్చే వాహనాలు ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించకుండా పెళ్లూరు ఫ్లైఓవర్ ఎక్కి కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ బైపాస్ పాస్ మీదగా విష్ణు ప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళవలెను.

3. కడప, కర్నూలు, చీమకుర్తి వైపునుండి మహానాడుకు వచ్చే వాహనాలు కర్నూల్ బై పాస్ సెంటర్ మీదగా సర్వీస్ రోడ్డు ద్వారా విష్ణు ప్రియ కల్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళవలెను.

4. కొత్తపట్నం వైపు నుండి వచ్చే వాహనాలు కొప్పోలు ఫ్లైఓవర్ మీదగా కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ పాస్ మీదగా విష్ణు ప్రియ కల్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళవలెను.

5. విజయవాడ, గుంటూరు, చీరాల వైపునుండి ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించే వాహనదారులు కిమ్స్ ఫ్లైఓవర్ మీదగా కొప్పోలు ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు మీదగా కొత్తపట్నం బస్టాండ్ మీదుగా ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించవలెను.

మహానాడు నుండి బయటకు వెళ్ళు వాహన మార్గములు

1. మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళు వాహనాలు గుంటూరు, విజయవాడ వైపుకు వెళ్ళటానికి (ఎన్.హెచ్ 16) ఎడమవైపు నుండి NH -16 రోడ్డుకి ఎంట్రీ అయ్యి త్రోవగుంట ఫ్లైఓవర్ ఏక్కీ వెళ్ళవలెను.

2. చీరాల వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి వెళ్ళవలెను.

3.మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళు వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి యూటర్న్ తీసుకుని కావలి, నెల్లూరు వైపు గా NH 16 కి ఎంట్రీ అయి వెళ్ళవలెను.

4. మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళు వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి యూటర్న్ తీసుకుని నేరుగా కిమ్స్ ఫ్లైఓవర్ ఎక్కి, పెళ్ళూరు ఫ్లై ఓవర్ దిగి యూటర్న్ తీసుకుని, ఒంగోల్ మినీ బైపాస్ మీదగా కర్నూల్, కడప మరియు చీమకుర్తి రోడ్ లో గుండా వెళ్ళవలెను.

5. ఒంగోలు టౌన్ నుండి గుంటూరు, విజయవాడ వైపుకు వేళ్ళు వాహనాలు కొత్తపట్నం బస్టాండ్ వైపు నుండి కొప్పోలు ఫ్లై ఓవర్ కు లెఫ్ట్ సైడ్ లో గల సర్వీస్ రోడ్డు మీదగా ఎన్ హెచ్ -16 కు వెళ్లి గుంటూరు, విజయవాడ వైపు వెళ్ళవలెను.

6. ఒంగోలు టౌన్ నుండి కావలి, నెల్లూరు వైపు వేళ్ళు వాహనాలు ఒంగోలు సౌత్ బైపాస్ మీదగా రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ మీదగా పెళ్లూరు ఫ్లై ఓవర్ అండర్ పాస్ ద్వారా NH .16 కు వెళ్ళవలెను.

7. ఒంగోలు టౌన్ నుండి చీరాల వైపుకు వెళ్ళు  వాహనాలు కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కొప్పోలు  ఫ్లైఓవర్ కు లెఫ్ట్ సైడ్ లోని సర్వీస్ రోడ్డు ద్వారా ఎన్ హెచ్ .16  రోడ్డుకు  వెళ్లి, కల్వరి టెంపుల్ ఆపోజిట్ రోడ్ లోని లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు ద్వారా త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి చీరాల రోడ్డు వైపు వెళ్ళవలెను.

Related posts

జిల్లా ఆసుపత్రిగా లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి

Bhavani

విశాఖ రేంజ్ పరిధిలో పది మంది సీఐలు బదిలీ…!

Bhavani

దేశంలోనే తొలి “సైకోమెట్రిక్ విద్య” రాష్ట్రంగా తెలంగాణ

Satyam NEWS

Leave a Comment