27.7 C
Hyderabad
April 25, 2024 07: 00 AM
Slider విజయనగరం

నాలుగో రోజు కూడా ట్రాఫిక్ అవగాహన

#Traffic Police

ఏపీలోని జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు హెల్మెట్ పెట్టుకోకపోవడం ,మద్యం సేవించి వాహనం నడపడమే కారణమని అటు పోలీసులు ,ఇటు వైద్య శాఖ చెబుతోంది. దీంతో రాష్ట్ర పోలీసు శాఖలోని ట్రాఫిక్ విభాగం అందుకు గట్టి చర్యలు చేపట్టింది.

ఈ మేరకు గత మూడు రోజులుగా విజయనగరం లో హెల్మెట్ పెట్టుకోవడంపై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించే చర్యలు కు దిగారు. ఈ మేరకు నగరంలో న్యూపూర్ణ జంక్షన్ వద్ద మున్సిపల్ కార్పోరేషన్ దగ్గర హెల్మెట్ పెట్టుకోవడంపై వాహనాలను నడుపుతున్న వారికి హెల్మెట్ పెట్టుకోవడంపై అవగాహన కల్పించారు.

ఎస్పీ రాజకుమారి ఆదేశాలు.. ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు సూచనలతో ట్రాఫిక్ ఎస్ఐ లు జియాయుద్దీన్ ,హరిబాబు ,ఏఏస్ఐ దాలినాయుడులు జంక్షన్ లో హెల్మెట్ పెట్టుకోకుండా వెళుతున్న వాహనాలను ఆపి…”హెల్మెట్ పెట్టుకోండి..ప్రాణాలు కాపాడుకోండి”అంటూ వాహనాలను నడుపుతున్న దాదాపు యాభై మందిని ఆపి ఈ విషయం చెప్పారు.

నగరం లో వారం రోజుల పాటు ఈ హెల్మెట్ ధరించాలన్న విషయాలపై వాహనాలను నడిపే వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ విధంగా చర్యలు చేపడుతున్నారు.

Related posts

రుణమాఫీపై ఎన్నికల హామీ తక్షణమే అమలు చేయాలి

Satyam NEWS

ఫథలాపూర్ గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

బిల్లు లు చెల్లించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం

Satyam NEWS

Leave a Comment