36.2 C
Hyderabad
April 25, 2024 20: 47 PM
Slider విజయనగరం

రోడ్డు ప్రమాదాల పట్ల ట్రాఫిక్ పోలీసుల అవగాహన చర్యలు

#vijayanagarampolice

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి… విజయనగరం జిల్లా పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రంగంలో కి దిగారు. ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 40 పోలీస్ స్టేషన్ సిబ్బంది ఒకే సారి రోడ్ల మీదకు వచ్చారు.

జిల్లా లోని ప్రధాన జంక్షన్ లలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న రోడ్ ప్రమాదాల స్థలాలను గుర్తించి న ఖాకీలు ఆయా ప్రాంతాల్లో నాకా బందీ మాదిరిగా ఆకస్మికంగా తనిఖీలతో పాటు వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు జిల్లాలోని మూడు సర్కిల్ల పరిధిలో ముఖ్య మైన ప్రాంతాలను గుర్తించిన పోలీసు శాఖ… ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

ఈ అవగాహన చర్యల్లో అటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది తో పాటు, ట్రాఫిక్ పోలీసులు కూడా పాల్గొని… ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు అందుకు తగ్గ కట్టడి చర్యలు ఏ విధంగా తీసుకోవాలో అవగాహన కల్పించారు… జిల్లా పోలీసులు అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లు పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు  వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు జరిమానాలు విధించారు.

Related posts

27 రకాల దళిత సంక్షేమ పథకాలను ఎందుకు ఎత్తివేసారో చెప్పగలరా?

Satyam NEWS

ఇద్దరు పిల్లల తల్లిని దారుణంగా కొట్టిన భర్త

Satyam NEWS

పలువురికి ఆదర్శంగా జనచైతన్య ట్రస్ట్

Bhavani

Leave a Comment