పొంగి పొర్లుతున్న నాగార్జునసాగర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువ అయింది. చాలా అరుదుగా మొత్తం 26 గేట్లు ఎత్తే దృశ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆదృశ్యం కనిపిస్తుండటంతో పర్యాటకులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా శెలవు దినాల్లో నాగార్జున సాగర్ లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా కనిపిస్తున్నది. ట్రాఫిక్ ఎక్కువ కావడంతో నాగార్జునసాగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి మాచర్ల, గుంటూరు వెళ్లే వాహనాలు పెద్దవూర, హాలియా, మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. గుంటూరు, మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు పిడుగురాళ్ల, అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే వైపు మళ్లిస్తున్నారు. అంతే కాకుండా నాగార్జునసాగర్ మీదుగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
previous post