24.7 C
Hyderabad
March 29, 2024 06: 52 AM
Slider విజయనగరం

“రాజుల” నగరంలో చవితి సందర్భంగా ట్రాఫిక్ ఇక్కట్లు..!

#dspvijayanagaram

ఈ నెల 10 వినాయక చవితి.. ఆ సందర్భంగా వాడవాడలా మండపాలు ,ఊరేగింపు లతో ఇప్పటికే హిందూ సంఘాలు అనుమతి ఇవ్వాలని కోరుతున్న సమయంలో రెండు రోజుల ముందే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బహిరంగ ఉత్సవాలకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో రాజుల నగరం విజయనగరం లో చవితి సందర్భంగా ట్రాఫిక్ ఇక్కట్లు సత్యం న్యూస్. నెట్ కు కనిపించింది. స్వయంగా ఫీల్డ్ లోకి వెళ్లిన సత్యం న్యూస్. నెట్  ప్రతినిధి… విజయనగరం లో ట్రాఫిక్ ఇక్కట్లను కళ్లరా చూసారు.నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరీ జంక్షన్, ఆర్ అండ్ బీ ,ఎంజీ రోడ్ ,గంటస్థంబం, మూడులాంతర్లు, కోట ,దాసన్నపేట ,ఐస్ ఫ్యాక్టరీ, జంక్షన్ లలో చవితి సందర్భంగా రోడ్ల విచ్చల విడిగా రిటైల్ వర్తకులు…విగ్రహాలు, పత్రితో అమ్మకాలు ప్రారంభించారు.

మున్సిపల్ పాలిటీ అనుమతి పొందారా లేక ,ఒక్క రోజు ఆసీలు పొందారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో నే నగరంలో సాయంత్రం సంధ్య వేళ…ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అయ్యాయి.ఈ నేపథ్యంలో ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆదేశాలతో ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు తన సిబ్బంది తో రంగంలో కి దిగారు. ఒక్క రోజు ముందే ట్రాఫిక్ డీఎస్పీ నైట్ డ్యూటీ చేసినప్పటికీ…హైకోర్టు తీర్పుతో వినాయక చవితి పండగకు ప్రాధాన్యత పెరిగింది.

దీంతో నగరంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే పనిలో డీఎస్పీ మోహన్ రావు ,ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు, సిబ్బంది విజయ్ కుమార్, సింహాచలం ఇతర సిబ్బంది తో అటు ట్రాఫిక్ ను ఇటు చవితి సందర్భంగా కొనుగోలు దారుల రద్దీ ని క్రమబద్దీకరించే చర్యలు చేపట్టారు. అలాగే లా అండ్ ఆర్డర్ సీఐ మురళీ సమక్షంలో ఆ సిబ్బంది కి కూడా రంగంలో కి దిగారు.

అటు ట్రాఫిక్ ఇటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది దాదాపు ఇరవై మందికి పైగా అటు ట్రాఫిక్ ను ఇటు వినియోగదారుల హాడావుడిని క్రమబద్దీకరించే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా గంటస్థంబం వద్ద ట్రాఫిక్ డీఎస్పీ సత్యం న్యూస్. నెట్ తో మాట్లాడారు.

Related posts

ఇన్ స్పెక్షన్: ప్రజలు బాగానే సహకరిస్తున్నారు

Satyam NEWS

శార్వానంద్ చిత్రం మహాసముద్రం పోస్టర్ విడుదల

Satyam NEWS

విత్ యు:కడ దాకా కలిసే వృద్ధ దంపతుల ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment