38.2 C
Hyderabad
April 25, 2024 11: 22 AM
Slider విజయనగరం

త్రిపుల్ రైడింగ్ పై కేసులు: హెల్మెట్ లేకపోతే ఫైన్: విజయనగరం ఎస్పీ ఆదేశాలు

#spdeepikaips

బైక్ లపై త్రిపుల్ రైడింగ్ చేసినా.. హెల్మెట్ పెట్టు కోకపోయినా కేసు లు పెట్టాలని, ఫైన్ లు వేయాలని శాఖా సిబ్బంది కి జిల్లా పోలీసు బాస్ ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా.. డీపీఓ లోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన నేర సమీక్ష సమావేశం సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ ఇటీవల కాలంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా, రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు, వాహన తనిఖీలు చేపట్టి, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపైన, అతివేగంగా వాహనాలు నడిపే వారిపైనా, ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేసేవారిపైన కేసులు నమోదు చేయాలన్నారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాద వివరాలను సులువుగా తెలుసుకొనే విధంగా పోలీసు స్టేషనులో రోడ్డు సేఫ్టీ మ్యాపును ఏర్పాటు చేసి, రోడ్డు ప్రమాద వివరాలను, సమయాలను చార్ట్ మీద నమోదు చేయాలన్నారు. స్పందన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలను తనకు నివేదించాలన్నారు.

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించండి

స్పందన ఫిర్యాదుల ఫిర్యాదుదారులను సంబంధిత ఎస్ఐలు, సిఐలు స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారంచూపే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు స్టేషనుకు వచ్చిన కారణాలను తెలుసుకొని, చర్యలు చేపట్టాలన్నారు.

స్టేషనులో నమోదైన అదృశ్యం కేసులపై ప్రత్యేక త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి ట్రేస్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆస్తికి సంబంధించిన నేరాల్లో రికవరీ చేసిన వస్తువుల వివరాలను, బరువును ఖచ్చితంగా వ్రాసి, కోర్టుకు అప్పగించాలన్నారు.

దర్యాప్తులో ఉన్న కేసుల్లో పెండింగులో ఉన్న అరెస్టులను వెంటనే చేపట్టి, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. అనంతరం, సిఐలు, డిఎస్పీలు దర్యాప్తు చేస్తున్న తీవ్రమైన నేరాలను జిల్లా ఎస్పీ సమీక్షించి, కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసే విధంగా అధికారులకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక దిశానిర్దేశం చేసారు.

ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసలు

జిల్లా పోలీసుశాఖలో విధులను సమర్ధవంతంగా నిర్వహించి ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేసారు. దర్యాప్తులో ఉన్న కేసులలో కీలక ఆధారాలు సేకరించి త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసినందుకుగాను, అక్రమ మద్యం నియంత్రించడంలో ప్రతిభ కనబరిచి నందుకుగాను బొబ్బిలి ఇన్ స్పెక్టరు ఆఫ్ పోలీసు ఎం.నాగేశ్వరరావుకు, జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహించడంలో ప్రతిభ కనబరిచినందుకు గాను జిల్లా పోలీసు కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ జె. చాముండేశ్వరి లను “బెస్ట్ ఫెర్మార్స్”గా ఎంపిక చేశారు.

వారిని అభినందించి, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక బహూకరించారు. అదేవిధంగా దొంగతనం కేసులను చేధించడంలోనూ, జూదం ఆడుతున్నవారిని పట్టు కోవడంలోనూ, గంజాయి, అక్రమ మద్యం రవాణాను పట్టుకోవడంలోనూ ప్రతిభ కనబరిచిన (1) ఐ. దుర్గాప్రసాద్, ఎస్ఐ, విజయనగరం 1వ పట్టణ పిఎస్ (2) యు. మహేష్, ఎస్ ఐ, భోగాపురం (3) జె. తారకేశ్వరరావు, ఎస్.ఐ, ఎస్.కోట (4) ఎ.సన్యాసినాయుడు, ఎస్.ఐ, చీపురుపల్లి (5) ఎస్.కృష్ణమూర్తి, ఎస్ ఐ, రామబద్రపురం లను ఎస్ పి అభినందించారు.

అలాగే జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన రికార్డులను నిర్వహించడంలో ప్రతిభ కనబర్చిన (6) జి.వి.రమణ, ఎ.ఒ, డిపిఒ, విజయనగరం, (7) ఎ.ఎస్.వి.ప్రభాకరరావు, పర్యవేక్షకులు, డిపిఒ, (8) టి. లక్ష్మణరావు, హెచ్.సి, ఐ.టి. కోర్, (9) కె.రమేష్, హోంగార్డు, డిపిఒ లను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, ఎస్ ఈ బి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు, విజయనగరం సబ్ డివిజన్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్, ఎఆర్ డిఎస్పీఎల్.శేషాద్రి, లీగల్ ఎడ్వయిజర్ వై. పరశురాం, సిఐలు బి. వెంకటరావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, సి. హెచ్. శ్రీనివాసరావు, కాంతారావు, సి. హెచ్. లక్ష్మణరావు, టి.ఎస్. మంగవేణి, విజయనాధ్, బాల సూర్యారావు, డి.రమేష్, జి.సంజీవరావు, ఎం. నాగేశ్వరరావు, పి. శోభన్ బాబు, ఎల్. ల్.అప్పలనాయుడు, టివి తిరుపతిరావు, విజయ ఆనంద్, నర్సింహమూర్తి, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

అప్పాయింట్ మెంట్: ఎయిమ్స్ బోర్డు సభ్యుడుగా బండ ప్రకాష్

Satyam NEWS

బైక్ అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

గ్రహణం తో ఆలయాల మూసివేత

Murali Krishna

Leave a Comment