30.2 C
Hyderabad
April 27, 2025 19: 25 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంశాలు

నిబంధన కేంద్రానిది చెడ్డపేరు రాష్ట్రానిది

Trafficviolation

వచ్చే నెల 1 నుంచి రోడ్డుపై వాహనాలు నడపాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మాట. మోటార్ వాహనాల చట్టం-2019 లోని 28 నిబంధనలను సవరించి  సెప్టెంబరు 1 నుంచి అమలు చేస్తున్నదేమో కేంద్ర ప్రభుత్వం, అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలే ఈ పని చేస్తున్నాయని వాహన దారులు సంబందిత ముఖ్యమంత్రుల్ని తిట్టిపోస్తున్నాయి. జగన్ అమెరికా వెళ్లివచ్చాడు ఇక్కడి రూల్సు మార్చాడు అంటూ ఏపి ప్రజలు ఈసడించుకుంటున్నారు. అదే తెలంగాణలో అయితే ముఖ్యమంత్రిదేముందండి ఆయన హెలికాప్టర్లో తిరుగుతాడు మాకు కదా ఇబ్బంది అంటూ విమర్శిస్తున్నారు. కేంద్ర చట్టం అయినా రాష్ట్రప్రభుత్వాలు అమలు చేయక తప్పని ఈ పరిస్థితుల్లో వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వాలకే వస్తున్నది. కేంద్ర చట్ట సవరణ చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన పాలనాపరమైన నిబంధనలను సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలూ హెల్మెట్‌ ధరించాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపై రూ.500 నుంచి రూ.10,000 వరకూ జరిమానా విధిస్తారు. ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించే నిబంధనలు అమలవుతాయి. అధిక లోడుతో వెళ్లే వాహనాలపై రూ.20 వేల జరిమానాతో పాటు ప్రతి అదనపు టన్నుకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తారు. పైగా, అదనపు బరువును దించేంతవరకూ ఆ వాహనాన్ని ముందుకు కదలనివ్వరు. నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాలకు ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 చొప్పున జరిమానా విధించడంతోపాటు, అదనపు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. సీటు బెల్టు ధరించని డ్రైవర్లకు రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఇలా వాహనదారులను భయపెట్టే నిబంధనలు చాలా ఉన్నాయి.

Related posts

ట్రావెల్స్ బస్సు బోల్తా

Murali Krishna

బియ్యం పంపిణీ చేస్తున్న గాయత్రి ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

నాట్ ఎల్జిబుల్:ఓట్లు అడిగే నైతిక హక్కు తెరాసకు లేదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!