33.2 C
Hyderabad
April 26, 2024 01: 15 AM
Slider ప్రత్యేకం

మూతిమీద మీసం ఇంకా రాని పిల్ల‌లు రోడ్ల‌పై ర‌య్ ర‌య్

#VijayanagaramTraffic

పద్దెనిమిదేళ్లు దాటితే ప్ర‌తీ ఒక్క‌రికి మైనారిటీ తీరిన‌ట్టే. ఆ పై ప్ర‌తీ ఒక్క‌రూ విధిగా పాటించాల్సిన విధానాలు.అనుస‌రించాల్సిన ప‌ద్ద‌తుల‌ను ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి…అనంత‌రం చ‌ట్ట ప్ర‌కారం అర్హ‌త పొందాలి.

చాలు చాలు.. ఇవ‌న్నీ మాకు తెలుసు అంటూ ఈ సొదెందుకంటారా..?   విద్య‌ల న‌గ‌ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో అదీ మైన‌ర్లు…ర‌య్ ర‌య్ మంటూ బైక్ లపై రోడ్ల‌పై హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే..న‌గ‌రంలోకి క‌లెక్ట‌రేట్  జంక్ష‌న్ వ‌ద్ద‌….ట్రాఫిక్ ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఉండ‌గానే..మూతి మీద మీసం మెలవ‌ని ఓ మైన‌ర్ బాలుడు…వెన‌క ఓ చిన్నోడిని పెట్టుకుని…స్కూటీ పై వెళ్ల‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే అయ్యింది.

సాలూరుకు వెళ్లే దారి నుంచీ స్కూటీ పై అదీ రాంగ్ రూట్ లో వ‌చ్చి…ఓ సైకిల్ ను ఢీ కొట్టాడు. ఆ స‌మ‌యంలో ట్రాఫిక్ పోలీసులు బైక్ ను ఆపేస‌రికి భ‌యంతో త‌న‌ను వ‌దిలేయాల‌ని..ఇంట్లో అమ్మ‌,నాన్న‌లు తిడ‌తారంటూ..ఏడ్చాడు కూడ‌.

సీన్ క‌ట్ చేస్తే…

తాజాగా అదే న‌గ‌రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద‌.. మ‌యూరీ జంక్ష‌న్ నుంచీ ఓ బైక్ పై   క‌స్పా కాలేజీలో చ‌దువుతున్న  ఇద్ద‌రు మైన‌ర్ విద్యార్దులు…అదీ రాంగ్ రూట్ లో వెళ్ల‌డంతో అక్క‌డే విధులు  నిర్వ‌హిస్తున్న‌ ట్రాఫిక పోలీసులకు  అడ్డంగా  దొరికిపోయాడు.

అప్పుడే ట్రాఫిక్ ను క్ర‌మబ‌ద్దీక‌రించే విష‌యంలో న‌గ‌ర ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు..ట్యాక్సీ స్లాండ్ వ‌ద్ద అక్క‌డున్న డ్రైవ‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఆ స‌య‌మంలో ట్రాఫిక్ సిబ్బందికి ఈ ఇద్ద‌రు మైన‌ర్స్ ప‌ట్టుబడటంతో వివ‌రాలు కనుక్కునే య‌త్నం చేసారు. తక్ష‌ణం సీఐ ఆదేశాల‌తో ట్రాఫిక్ సిబ్బంది మైన‌ర్లు వెళుతున్న బైక్ ఫోటోను తీయ‌డంతో ఇద్ద‌రూ  భ‌యంతో బిక్క చ‌చ్చిపోయి .వ‌దిలేయండి సార్..త‌ప్పు అయిపోయింది.

ఇంటికి వెళిపోతాము…జుమ్ముకు వెళ్లాలంటూ ఏడ‌వ‌టం మొద‌లు పెట్టారు. మీ పేర్లేంటి..? అమ్మ‌,నాన్న‌లెవ‌రు.? ఎక్క‌డుంటూరు అని  ట్రాఫిక్ సీఐ ప్ర‌శ్నించేస‌రికి…ఇంకెప్పుడూ బైక్  తీయ్య‌మ‌ని.. అమ్మ‌,నాన్న‌లు లేర‌ని…మావ‌య్య వ‌ద్దే ఉంటున్నామంటూ చెప్ప‌సాగారు.

అయితే అప్ప‌టికే రోడ్ పై ట్రాఫిక్ స్తంభించ‌డంతో..బైక్ ను స్టేష‌న్ కు తీసుకెళ్లాల‌ని సిబ్బందిని ఆదేశించిన ట్రాఫిక్ సీఐ…మైనర్ల‌ను కూడా స్టేష‌న్ కు వెళ్లాల‌ని చెబుతూ..ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేయించారు. ఏదైనా..మైనారిటీ తీర‌ని పిల్ల‌లు బైక్ ల‌పై రోడ్ల మీద‌కు రావ‌డానికి కార‌ణాలు ఎన్ని అయినా ఉండొచ్చు.. వారికి ఆ స్వేచ్చ నిచ్చింది ఎవ‌రు…కన్న‌వారా..?  లేక‌ ప‌రిస్థితుల ప్ర‌భావ‌మా..?

Related posts

స్పందన ఫిర్యాదులపై అక్కడికక్కడే పరిష్కారం

Bhavani

జూన్ 10 న జాతీయ లోక్ అదాలత్

Bhavani

విశాఖ పోర్టుకు తొలి సారి వచ్చిన భారీ రవాణా నౌక

Satyam NEWS

Leave a Comment