స్నేహితులతో కలిసి కులుమానాలి విహార యాత్రకు వెళ్లిన ఒక డాక్టర్ విషాదకర పరిస్థితుల్లో మరణించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పక్కన కొత్త పల్లె గ్రామానికి చెందిన చంద్ర శేఖర్రెడ్డి కుటుంబం గత కొంత కాలం గా నాగోల్ లోని సమత పూరి కాలనీ లో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ECIL లోని శ్రీకర్ హాస్పిటల్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి కులు మనాలి వెళ్లారు. అక్కడ ప్యారచుట్ వేసుకొని గాల్లో విహరిస్తూ ప్రమాదశాత్తూ అది తెగిపడటంతో మరణించారు. 24 ఏళ్ల యువ డాక్టర్ మరణించడంతో ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
previous post
next post