దేవిపట్నం వద్ద గోదావరిలో బోటు ప్రమాదానికి కారణం అయిన బోటు ఓనర్ వేంకటరమణ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏ పి సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశాలు ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. బాధితులు కు అన్ని విధాలుగా అండగా ఉంట్టమని అయిన బాధితులు కు భరోసా ఇచ్చారు. బాధితులను ఏ పి ప్రభుత్వ అన్ని విధాలుగా ఆడుకుంటుందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కు ఆళ్ల నాని హామీ ఇచ్చారు. రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ లో బోట్ ప్రమాదం బాధితులు ను సోమవారం పరామర్శించిన ఆళ్ల నాని బాధితులుకు అందుతున్న వైద్య సేవల పై వైద్య అధికారులు ను అడిగి తెలుసుకున్నారు. బోటు మునక ఘటనలో మృతుల కోసం 2 NDRF, 3SDRF, 6 అగ్నిమాపక , 2 నేవీ, గజఈతగాళ్ళ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అదే విధంగా 2నేవీ , 1 ఓన్జీసీ హెలికాప్టర్లతో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు విపత్తుల శాఖ కమీషనర్ తెలిపారు. సైడ్ స్కాన్ సోనార్ , ఇతర ఆధునాతన పరికరాలతో వచ్చిన ఉత్తరాఖాండ్ ప్రత్యేక బృందం గన్నవరం ఏయిర్ పోర్టుకు చేరుకుంది.