27.7 C
Hyderabad
March 29, 2024 03: 59 AM
Slider ముఖ్యంశాలు

ఎక్స్ ప్రెస్ టైన్ కు తప్పిన ప్రమాదం

#nandaluru

కడప జిల్లా నందలూరు చెయ్యేరు రైల్వే వంతెనపై అహ్మదాబాద్ నుంచి చెన్నయ్ వెళుతున్న  హంసపర్ ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పలువురు సిబ్బంది పై రైల్వే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సంఘటనను గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

నందలూరు రాజంపేట మార్గ మధ్యలో ని చేయ్యేరు నది రైల్వే వంతెన పై గురువారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళుతున్న రైలు వంతెనపై కి రాగానే. రైలు పట్టాల కింద వున్న క్లష్ ప్లేట్లు ఎగిరి పడినట్లు సమాచారం. దీనితో రైలు పట్టాలు పైకి లేసి ఇంజన్ కింది భాగంలో చోచ్చుకు పోవడంతో రైలు నిలిచి పోయింది.

ఇంజన్ ఆయిల్ టాంకర్ పైకి  కంకర రాళ్లు ఇనుప  ముక్కలు ఎగిసిపడ్డడం తో అందులోని 2.500 లీటర్ల డీజిల్ కారిపోయింది. అక్కడ విధుల్లో వున్న విద్యుత్ సిబ్బందికి గాయాలయ్యినట్టు తెలిసింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం ములంగా ప్రమాదం తప్పిందని,లేకుంటే రైలు వంతెన పైనుంచి పడి పెను ప్రమాదం సంభవించెదని తెలిసింది.

రైలు పట్టా కట్ చేసి ట్రాక్ మధ్యలో వేయడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇంజన్ మార్చి రైలును అధికార్లు పంపి వేసినట్టు తెలిసింది.భారీ ప్రమాదం తప్పడంతో అధికారులు,ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న 5 మంది గ్యాంగ్ మెన్ల పై వేటు వేసినట్లు తెలిసింది.

Related posts

మున్నూరు కాపు మహిళల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి

Satyam NEWS

అక్రమ సారాపై కర్నూలు జిల్లాలో ఉక్కుపాదం

Satyam NEWS

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment