బీహార్‌లోని హాసన్‌పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బీహార్‌లోని సమస్తిపూర్-ఖాగారియా డివిజన్‌లోని హసన్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఎద్దుల బండిని ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు
ఎద్దుల బండిపై రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ,బండి నడుపుతున్నవ్యక్తి రైలును గమనించలేకపోవాదం తో ఈ దుర్ఘటన జరిగినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజేష్ కుమార్ పేర్కొన్నారు.ఎద్దుల బండిని నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యం తోనే ఈ ప్రమాదం జరిగిందని అయన చెప్పారు.సంఘటన శలానికి వైద్య బృందాలను పంపినట్లు అయన తెలిపారు.
ప్రమాదం లో సూరజ్ యాదవ్ (35), రామ్ బాబు (30), ప్రవీణ్ కుమార్ (30) మరియు కాంచన్ కుమార్ (35), ఒక గుర్తు తెలియని వ్యక్తి,మృతి చెందగా 15 ఏళ్ల బాలికతో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు