క్రమశిక్షణ గల పౌరులుగా విద్యార్ధులను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ వై సాయి శేఖర్ ఆదేశాలతో పోలీసులు చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులను క్రమశిక్షణ గల భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలనే ఉద్ద్యేశం తో స్టూడెంట్ పోలీస్ క్యాడేట్ (SPC) వారాంతపు ఔట్ డోర్ శిక్షణ ప్రారంభించారు.
నేడు తాడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో SPC క్యాడేట్ లు గా ఎంపికైన విద్యార్థులకు ఔట్ డోర్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పోలీస్ శిక్షణ ట్రైనర్స్ డి.కురమయ్య ఎఆర్ఎస్ఐ, వెంకట్ నారాయణచారి ఎఆర్ఎస్ఐ, పి.ఈ.టి వి . సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్ధులలో సేవ గుణం పెంపొందించేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు.
క్రమశిక్షణ తో వారు ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు వీలుగా జిల్లా లోని 8, 9 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా స్టూడెంట్ పోలీస్ క్యాడేట్ (SPC) వారాంతపు ఔట్ డోర్ శిక్షణనిస్తున్నారు. ఈ శిక్షణ కారణంగా విద్యార్థులకు రోగ నిరోధక శక్తి పెరిగి వారిలో శరీర దారుఢ్యం పెంపొందుతుందని పోలీసు శిక్షకులు తెలిపారు.