27.7 C
Hyderabad
April 20, 2024 02: 27 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూనివర్సిటీ లో మహిళ పొలీసులకు ఐదవ రోజు శిక్షణ

#vikramsimhapuri

వి ఎస్ యూ లో వార్డ్/ గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శుల (మహిళ పొలీసులకు) ఐదవ రోజున  జరిగిన  శిక్షణ తరగతులలో బుజ్జి రెడ్డి పల్లెం యస్ ఐ ప్రసాద్ రెడ్డి, మాట్లాడుతూ యస్.సి, యస్.టి తరగతులకు చెందిన వ్యక్తుల పై నిరంతరంగా పెరుగుతున్న నేరాలను అరికట్టడానికి ,బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించడానికి ప్రయత్నించాలని కోరారు. ఇటువంటి కేసులను ట్రయిల్ జరపడానికి  ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే ఉద్దేశం తో  భారత పార్లమెంట్ షెడ్యూల్డ్  కులాలు, తెగల పై జరుగు అత్యాచారాల నిరోధానికి సంబంధించిన నియమాలు 1989ను ఆమోదించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ చట్టం క్రింద నేరాలను దర్యాప్తు చేసే అధికారం సబ్ డివిజినల్ పోలీసు అధికారికి ఉంటుందని ఆయన వివరించారు.

వెంకటచలం యస్ ఐ టి.చైతన్య క్రాంతి మాట్లాడుతూ ఎవరైనా ఒక పురుషుడు ,ఒక స్త్రీ ని అవమానపరచాలనే సంకల్పంతో ఆ స్త్రీ కి వినపడే విధంగా మాట్లాడినా,ఆమె చూచే విధంగా సంజ్ఞలు చేసిన లేక ఆమె చూసే విధంగా ఏదైనా వస్తువును ప్రదర్శించిన లేక ఆమె ఏకాంతమునకు భంగము కలిగించిన అటువంటి నేరమును స్త్రీలను అల్లరి పెట్టి,అవమానించు (ఈవ్ టీజింగ్ ) నేరంగా పరిగణించబడుతుందని వివరించారు.

మీడియా అవసరం -వారితో  మంచి సంబంధాలు అనే అంశంపై కోవూరు సి ఐ రామ క్రిష్ణ రెడ్డి, మాట్లాడుతూ ప్రజలు తమకు తాముగా విషయాలను తెలుసుకోలేరు కాబట్టి ప్రజలకు అర్ధం అయ్యే విధంగా మీడియా చేస్తుందని అన్నారు. ప్రజలకు తక్కువ సమయములో సమాచారాన్ని అందించడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాను నిర్వహించు వ్యక్తులు ఎప్పటికప్పుడు పోటీ పడుతూ ముందస్తు లో ఉండేందుకు ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాలు వి.సత్రం,ఇందుకూరుపేట, టి.పి గూడూరు,ముత్తుకూరు, నెల్లూరు రూరల్,కృష్ణ పట్నం పోర్ట్ మహిళ పోలీస్ పాల్గొన్నారు.

Related posts

లేడీ బాస్: ప‌నితీరుతో సిబ్బందికి వ‌ణుకు పుట్టిస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

తొలిసారి ఎగిరే హైబ్రిడ్ కారును లాంచ్ చేయనున్న ఇండియా

Sub Editor

గ్యార్మి వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు రంగినేని

Satyam NEWS

Leave a Comment