28.7 C
Hyderabad
April 25, 2024 06: 17 AM
Slider వరంగల్

మైక్రో అబ్జర్వర్లకు ములుగులో శిక్షణా కార్యక్రమం

#MicroObservers

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే  మైక్రో అబ్జర్వర్స్ కి నేడు ములుగు జిల్లా కలెక్టరెట్ వీడియో  కాన్ఫరెన్స్ హాలులో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా  తరగతులను రెవెన్యూ డివిజనల్ అధికారి, సహాయ ఎన్నికల అధికారి కె.రమాదేవి, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జడ్పీ సీఈఓ ప్రసూన రాణి పాల్గొన్నారు.

జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల లో పోలింగ్ నిర్వహణ పైన 21 మంది  మైక్రో అబ్జర్వర్స్ కి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ నియమావళి, విధులు  నిర్వహణ పై జాగ్రత్తల గురించి మాస్టర్ ట్రైనర్ లు శిక్షణ తరగతులు నిర్వహించారు.

పోలింగ్ సామాగ్రి తీసుకున్న నుండి పోలింగ్ పూర్తి అయ్యే వరకు వారు ఎన్నికల అబ్జర్వర్స్ కంట్రోల్ లో పని చేయవలసి ఉంటుందని, మైక్రో అబ్జర్వర్స్ పోలింగ్ ప్రక్రియలో ఎన్నికల నియమ నిబంధనల మేరకు పని చేయాలని సూచించారు.

పోలింగ్ నిర్వహించేందుకు  కెమెరాలు అమర్చే విధానం నుండి వీడియో చిత్రీకరణ వరకు అన్ని అంశాలపై శిక్షణనిచ్చారు. పోలింగ్ కేంద్రాల లో 100 మీటర్ల పరిధిలో ఎలాంటి బ్యానర్, పోస్టర్ ఎలాంటి ప్రచారం జరగకుండా అబ్జర్వ్ చేయాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి కె.రమాదేవి మాట్లాడుతూ, ఎన్నికల ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఎన్నికల డ్యూటీకి కేటాయించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఏ పోలింగ్ బూత్ లో డ్యూటీ వేసేది ఒక్క రోజు ముందు మాత్రమే తెలుస్తుందని, దానికి అందరూ సిద్దంగా ఉండాలని అన్నారు.

ఏదైనా హెల్త్ పరంగా  మెడిసిన్ ఉపయోగించే వారు వారి  మెడిసిన్ ను ముందు జాగ్రత్త గా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు తహశీల్దార్ సత్యనారాయణ స్వామి, మాస్టర్ ట్రైనర్లు గా ఎస్. సతీష్ కుమార్, ఎస్.శ్రీనివాస్ రెడ్డి, పి.భాస్కర్, టి.కిషోర్ తో పాటు మైక్రో అబ్జర్వర్స్, సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రోటారాక్ట్ – రోటరీ ఆధ్వర్యంలో స్కూలు పిల్లలకు బట్టల పంపిణీ

Satyam NEWS

సింగిల్ విండో డైరెక్టర్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

Bhavani

జూన్ 1 నుంచి వినియోగంలోకి శిల్పారామం

Satyam NEWS

Leave a Comment