ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో విద్యుత్ శాఖ భవనాలు కూడా ఉన్నాయి. ఆ భవనాలు ఇక పూర్తిగా తెలంగాణాకు సొంతం కాబోతున్నాయి. వీటిపై రెండు రాష్ట్రాలు చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ శాఖ భవనాల పేరిట ఏపికి రావాల్సిన వాటా మొత్తం ₹ 933 కోట్లగా ఖరారు చేశారు. ఈ మొత్తాన్ని డబ్బుల రూపంలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది. త్వరలో జరిగే రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో ఈ అంశంపై చర్చించి తుది ఆమోదముద్ర వేయనున్నారు. ఇక దీంతోపాటు విద్యుత్ సరఫరా బకాయిల కింద తెలంగాణ ఇవ్వాల్సిన మొత్తం ₹ 3 వేల కోట్లుగా తేల్చారు. ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించడం కష్టమవుతుంది. అందుకు బదులుగా ఏపీకి విద్యుత్ ను సరఫరా చేస్తామని తెలంగాణా ప్రతిపాదించింది. దీనిపై కూడా రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
previous post
next post