32.7 C
Hyderabad
March 29, 2024 10: 43 AM
Slider మెదక్

పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం

శీతాకాలంలో మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుతాయని, పొగమంచు దట్టంగా కమ్మేస్తుంటుందని ఉదయం 8 గంటలైనా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడతాయని ఎస్ పి పి.రోహిణి ప్రియదర్శిని అన్నారు. ఈ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నదని అన్నారు. ఉదయం సమయంలో పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉండడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతాయని వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై పొగమంచు ఏర్పడటం ఈ సమయాల్లో ప్రయాణం ప్రమాద భరితంగా మారే అవకాశం ఉన్నదని తెలిపారు.

వాహనాల నుంచి వెలుపడే పొగ కారణంగా మంచు మరింత దట్టంగా మారుతుందని దాని వల్ల రహదారి ఐదారు మీటర్ల దూరం వరకు కనిపించని పరిస్థితి ఉంటుందని అన్నారు. వాహనానికి లైట్లు వేసుకున్నా కొంత దూరంలో ఉన్న వాహనం కూడా దగ్గరకు వచ్చే వరకు కనిపించదని ఈ సమయంలో వేగంగా ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు చోటు సుకుంటాయని తెలిపారు. కాబట్టి వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరగకుండా నియంత్రించే అవకాశం ఉంటుందని అన్నారు. పొగమంచు సమయంలో వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లినా చాలా దూరం వరకు చూడలేం.

డ్రైవింగ్‌ సమయంలో తక్కువ స్పీడ్‌లో ఉంటే సడెన్‌గా ఏదైనా కనబడితే బ్రేక్‌ వేసి నియంత్రణలోకి తీసుకోవచ్చు. అధిక వేగంలో ఉన్న వాహనం సడన్‌ బ్రేక్‌ వేయడం వల్ల బోల్తా పడడం, ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటి ఘటనలు జరుగుతాయి. ఈ క్రమంలో విలువైన ప్రాణాలు కోల్పోతారు. అందుకే చలికాలంలో డ్రైవింగ్‌ చేసేప్పుడు వాహనాల హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, బ్రేక్‌లైట్లు వేసుకోవాలి. వేగం కాదు ప్రాణాలే ముఖ్యమని ప్రతి వాహనదారుడు గుర్తించాలని అన్నారు.

Related posts

రేపు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Bhavani

అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం

Satyam NEWS

అన్న‌దాత‌ల‌కు ఆన్‌లైన్ వ్య‌వ‌సాయ క‌న్స‌ల్టేష‌న్‌

Satyam NEWS

Leave a Comment