28.2 C
Hyderabad
April 20, 2024 14: 10 PM
Slider మహబూబ్ నగర్

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

#narayanapet police

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని జిల్లా  ఎస్పీ. డాక్టర్ చేతన అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు  జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ పోలీస్ సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో డీజీపీ ఆదేశాల మేరకు విస్తృతంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు.

చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా  తీసుకోవాలని సూచించారు.

ప్రాణాధారమైన మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా సకాలంలో రుతుపవనాలు రావడమే కాకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు హరితహారం లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత మైన వాతావరణం అందించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (DAR) భరత్, ఫారెస్ట్ ఆఫీసర్ నారాయణరావు, RI. కృష్ణయ్య, DCRB.SI. చంద్ర మోహన్ రావు SB. SI. రాజు, డిపిఓ స్టాప్, ఎస్బి స్టాప్ ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, హోంగార్డ్స్ అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.

Related posts

నిన్న రాజకుమారి నేడు దీపిక: దిశ యాప్ పై ఎస్పిల ప్రత్యేక శ్రద్ధ

Satyam NEWS

బీసీ లకు స్థానిక రిజర్వేషన్ల లో వైసీపీ ద్రోహం

Satyam NEWS

ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్న వ్యక్తి నాపై ఆరోపణలు చేయడమా..?

Satyam NEWS

Leave a Comment