27.7 C
Hyderabad
April 20, 2024 01: 50 AM
Slider ఖమ్మం

పర్యావరణ పరిరక్షణ భావితరాలకు కానుక

#haripriya

పర్యావరణ పరిరక్షణ భావితరాలకు కానుక అని  ఇల్లందు ఎమ్మెల్యే  బానోత్ హరిప్రియ  వెల్లడించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం కామే పల్లి  మండలంలోని పండితాపురం నుండి   జోగు గూడెం వెళ్ళు ఆర్ అండ్ బి  రహదారికి ఇరువైపులా 20వ  వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని   పండితాపురం గ్రామంలో మొక్క నాటి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు మంత్రి కేటీఆర్ పర్యావరణ పరిరక్షణ భావితరాలకు ఉపయోగపడుతుందని ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమం చేపట్టటం అభినందనీయమని అన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్  ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక  పోషించడం  సంతోష దగ్గ పరిణామం అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కామేపల్లి మండల అధ్యక్షుడు ఎ.అచ్చయ్య, ఎంపీపీ  సునీత రాందాస్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్  మేకల మల్లి బాబు యాదవ్, గ్రామ సర్పంచ్ ఎం దుర్గా జ్యోతి,  మల్లెం పాటి  శ్రీనివాస రావు ,డి హనుమంతరావు, భానోత్ నరసింహ నాయక్, కృష్ణారెడ్డి, నాగేంద్రబాబు, కృష్ణ ప్రసాద్ రాయల  వెంకన్న, ఉపేందర్ ఎంపీడీవో సీలార్  సాహెబ్ ,ఎఫ్ ఆర్ వో సంతోష్, ఫారెస్ట్ ఆఫీసర్లు సాంబశివరావు ,శ్రీను, నాగరాజు,  ఈవో ఆర్ డి సత్యనారాయణ, ఏ పీ ఓ శ్రీ రాణి ,ఏవో తారా దేవి పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

నవనీత కృష్ణుడు గా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి

Satyam NEWS

గుమ్మడి ప్రకాష్ జ్ఞాపకార్ధం మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ అన్నదానం

Satyam NEWS

టీ-డయాగ్నోస్టిక్స్‌లో నేటి నుంచి 134 టెస్టులు

Satyam NEWS

Leave a Comment