30.7 C
Hyderabad
April 19, 2024 08: 36 AM
Slider గుంటూరు

మొక్కలు నాటిన ఇన్ కమ్ టాక్స్ అధికారులు, రోటరీ సభ్యులు

#narasaraopet

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నరసరావుపేట ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, రోటరీ క్లబ్ ఆఫ్ నరసరావుపేట సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో డెబ్బయ్ ఐదు మొక్కలు నాటారు.

ముఖ్య అతిధిగా ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇన్సెక్టర్ సుబ్బారావు, ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ పి.రాజేశ్వరి, రోటరీ క్లబ్ సభ్యులు విచ్చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మన భారత దేశానికి స్వాత్రంత్రం వచ్చి డెబ్బయ్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ తరపున డెబ్బయ్ ఐదు మొక్కలు నాటడం జరిగిందని. పిల్లలందరూ ప్రతి రోజు మొక్కలకు నీరు పోసి వాటిని బ్రతికించడం వలన చాలా ఉపయోగాలు వున్నాయని, చెట్లు వలన ఆక్సిజన్ విడుదల అవుతుందని, ప్రతి మనిషికి ఆక్సిజన్ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు

ఈ ప్రోగ్రామ్ కు సహకరించిన స్కూల్ హెడ్ మాస్టర్ హనుమంత రావు,రోటరీ క్లబ్ సభ్యులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు యమ్.సుమిత్ర కుమార్, పాస్ట్ ప్రెసిడెంట్ చేకూరి సాంబశివరావు, డి.జి.ఇ. తాళ్ల రాజశేఖర్ రెడ్డి, ప్రవల్లిక సత్యం, పొట్టి శశి భూషణ్, ఎస్ కె.జిలానిమాలిక్, పొత్తూరి శివనాగరాజు, లీనా లావణ్య, కొత్తూరి శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయని,ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Purchase Cbd Hemp Oil Bottle

Bhavani

మెరుగైన సమాజం కోసం క్లాస్ మెంట్ క్లబ్

Satyam NEWS

విదేశీ దంపతులకు బాలిక దత్తత

Bhavani

Leave a Comment