31.2 C
Hyderabad
April 19, 2024 05: 49 AM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం రాజీవ్ స్టేడియంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే .!

#mla kolagatla

దివంగ‌త‌ సీఎం వైఎస్ఆర్, ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఆధ్వ‌ర్యంలో రూపు దాల్చిన జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌న‌గ‌రం పాత బ‌స్తాండ్ లోని రాజీవ్ క్రీడా మైదానంలో విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే,వైఎస్ఆర్సీపీ ఉత్త‌రాంధ్ర క‌న్వీన‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మొక్క‌లు నాటారు.

ఇటీవల ఊహించ‌ని విధంగా వ‌చ్చిన ఫ‌స్ట్ అండ్ సెకండ్ వేవ్ క‌రోనా మూలంగా ప‌లువురు క్రీడాకారులు త‌మ‌,త‌మ కుటుంబాల‌కు,క‌న్న‌వాళ్ల‌కు,క‌ట్టుకున్న వాళ్ల‌కు దూర‌మ‌య్యారు. వారి జ్ఙాప‌కార్దం జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భద్ర‌స్వామి మొక్క‌లు నాటారు. స్టేడియం ప్రాంగ‌ణంలో .దాదాపు 50 మొక్క‌ల‌ను మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్, కార్పొరేట‌ర్, ఇత‌న నేత‌ల‌తో  నాటింప చేసారు…ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌.

ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దివంగ‌త సీఎం వైఎస్ఆర్ హ‌యాంలో తాను ఎమ్మెల్యే గా ఉన్న స‌మ‌యంలో  ఈ స్డేడియం రూప‌క‌ల్ప‌న జ‌రిగింద‌న్నారు. అనంర‌తం టీడీపీ పాలన రావ‌డంతో  స్డేడియం ఇష్టం వ‌చ్చిన‌ట్టు త‌యారైంద‌న్నారు.మర‌ల త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆధునిక హంగుల‌తో రాజీవ్ స్టేడియం రూపుదిద్దుకుంద‌న్నారు.అయితే గ‌డ‌చిన ఏడాది గా క‌రోనా మూలంగా చాలా మంది క్రీడాకారులు మృతి చెందార‌ని వారి జ్ఙాప‌కార్ధం స్డేడియంలో ఒక్కొక్కొరి చేతల మొక్క‌లు నాటించే ప్ర‌కృయ చేప‌ట్టామ‌న్నారు.

అయితే సీఎం జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ జ‌గ‌న్న ప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మంలో ప్ర‌తీ ఒక్కరినీ బాగస్వామ్యం చేయాల‌నే సంక‌ల్పంతోనే ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త కార్య‌క్రమం చేప‌ట్టామ‌ని ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల అన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో  అట‌వీశాఖ సోష‌ల్ విభాగ‌పు అధికారి జాన‌కీరావు హ‌రిత కోఆర్డినేట‌ర్ రామ్మోహ‌న్ రావు,ప్లాంటేష‌న్ ర‌వి ,  మేయ‌ర్ వీ.విజ‌య‌ల‌క్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి,వైఎస్ఆర్సీపీ న‌గ‌ర అధ్య‌క్షుడు ఆశ‌పు వేణు,  17వ డివిజ‌న్ కార్పొరేట‌ర్,స్థానిక నేత‌లు పాల్గొన్నారు,

Related posts

డిప్యూటీ సీఎం  ప‌ర్య‌ట‌న‌లో మీడియా కు కష్టాలు…!

Satyam NEWS

భారత సైనికులకు నిర్మల్ లో ఘన నివాళి

Satyam NEWS

అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం

Satyam NEWS

Leave a Comment