27.7 C
Hyderabad
April 26, 2024 03: 33 AM
Slider విజయనగరం

స్థానికుల‌చే మొక్కలు నాటించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

#vijayanagaram mla

ప‌ర్యావ‌రణం ప‌చ్చగా ఉంటే కాలుష్యం రాకుండా నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షింగా ఉంటార‌న్నారు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి. జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణంలో భాగంగా విజ‌య‌న‌గ‌రంలోని 32 వ వార్డు న‌ర‌సింహ‌న‌గ‌ర్ లో దాదాపు 40 మొక్క‌ల‌ను స్థానికుల‌చే నాటించారు…ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌..తొలుత  ఒక మొక్క మాత్ర‌మే  నాటారు.

మిగిలిన 39 మొక్క‌ల‌ను మృతి చెందిన వారి పేర్ల‌తో సంబంధీకుల‌చే మొక్క‌లు నాటింప చేసారు…ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌. ఈ సంద‌ర్భంగా స్థానికంగా ఉంటూ సంగీతం ప‌ట్ల ఆస‌క్తి,అభిరుచి,శ్రద్ద క‌లిగి…అనునిత్యం సంగీతంలోనే బ‌తుకుతున్న క‌స్తూరి సుభ‌ద్రా దేవితో ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఆమె ఇంటి ముందే మొక్క‌ను నాటింప చేసారు.

అనంత‌రం న‌గ‌ర మేయ‌ర్ వీ.విజ‌య‌లక్ష్మి  మీడియాతో మాట్లాడుతూ  న‌గ‌ర‌మంతా పచ్చ‌ద‌నంతో ఫ‌రిడ‌విల్లాల‌న్నారు.  ప్ర‌తీ ఒక్క న‌గ‌ర పౌరుడు ఒక మొక్క‌ను  నాటాల‌ని  పుట్టిన సంతానం  లాగే నాటిన మొక్క పెరిగి పెద్ద అయ్యేవ‌ర‌కు పెంచాల‌న్నారు.

ఎమ్మెల్యే స్వామి ఆ ఉద్దేశ్యంతో ప్ర‌తీ ఒక్క‌రిచేత స్థానికంగా వాళ్ల‌కు సంబంధించిన వాళ్ల‌తోనే మొక్క‌లు నాటించే కార్య‌క్ర‌మం చేప‌డుతున్నార‌న్నారు.

అనంత‌రం ఎమ్మెల్యే బిడ్డ‌, 29వ  డివిజన్ కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా  ఈ జ‌గ‌న‌న్న ప‌చ్చ తోర‌ణం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంద‌ని..అందుకు ఆద్యుడు ప‌దోన్న‌తిపై బ‌దిలీ అయిన  క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అని..ఆ స్పూర్తితోనే న‌గ‌రంలో మొక్క‌ల పెంప‌కం మ‌రింగా విరివిగా నాటడం జ‌రుగుతోంద‌న్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో పార్టీనేత‌లు రెడ్డి స‌న్యాసినాయుడు,  32 వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ తో పాటు 33 వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ రంగా, ఎమ్మల్యే  పీఎస్ ప్ర‌భాక‌ర్, పీఏ శంక‌ర్ తో పాటు స్థానికులు పాల్గొన్నారు.

Related posts

ఢిల్లీని చుట్టేసిన దీపావళి టపాసుల కాలుష్యం

Satyam NEWS

ఫిబ్రవరి 7న కుస్తీ పోటీలకు ఎంపికలు

Satyam NEWS

తెలుగు రాజకీయాల్లో ఆ నాటి సంచలనం కాట్రగడ్డ ప్రసూన

Satyam NEWS

Leave a Comment